హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Nirav Modi Case: వామ్మో .. నీరవ్ మోదీ మాములోడు కాదయ్యా.. ఆ దేశంలో దొరికిన వాటి విలువ చూస్తే మూర్ఛపోతారు !

Nirav Modi Case: వామ్మో .. నీరవ్ మోదీ మాములోడు కాదయ్యా.. ఆ దేశంలో దొరికిన వాటి విలువ చూస్తే మూర్ఛపోతారు !

 వామ్మో .. నీరవ్ మోదీ మాములోడు కాదయ్యా.. ఆ  దేశంలో దొరికిన వాటి విలువ చూస్తే మూర్ఛపడిపోతారు !

వామ్మో .. నీరవ్ మోదీ మాములోడు కాదయ్యా.. ఆ దేశంలో దొరికిన వాటి విలువ చూస్తే మూర్ఛపడిపోతారు !

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్‌కి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ (Nirav Modi) మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఓ ప్రధాన పురోగతి సాధించింది. అదేంటంటే..

బ్యాంకు(Bank)లకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్‌కి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ (Nirav Modi) మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఓ ప్రధాన పురోగతి సాధించింది. హాంకాంగ్‌లోని నీరవ్ మోదీ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో నీరవ్ మోదీకి చెందిన రత్నాలు (Gems), ఆభరణాలు ఉన్నట్లు గుర్తించింది. అలానే ఆ దేశంలో మేనేజ్ చేస్తున్న అతని కంపెనీల బ్యాంక్ ఖాతాల్లో రూ.253.62 విలువైన బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని తెలుసుకుంది. మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈ రత్నాలు, ఆభరణాలు, బ్యాంక్ బ్యాలెన్స్‌లను తాత్కాలికంగా సీజ్ లేదా అటాచ్ చేసినట్లు శుక్రవారం తెలిపింది. దీంతో ఈ కేసులో అటాచ్ చేసిన, జప్తు చేసిన ఆస్తుల విలువ రూ.2,650.07 కోట్లకు చేరుకుందని ఈడీ పేర్కొంది.

హాంకాంగ్‌లోని నీరవ్ మోది గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన కొన్ని ఆస్తులు ప్రైవేట్ లాకర్లలో రత్నాలు, ఆభరణాల రూపంలో దొరికాయి. అలానే హాంకాంగ్‌లో నిర్వహిస్తున్న ఖాతాలలోని బ్యాంక్ బ్యాలెన్స్‌లను కూడా అధికారులు గుర్తించారు. వీటన్నిటిని మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) సెక్షన్ల కింద తాత్కాలికంగా అటాచ్ చేసినట్లు ఈడీ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాంకుల్లో ఉంచిన మొత్తం 30.98 మిలియన్ల డాలర్లు (సుమారు రూ.247 కోట్లు), 5.75 మిలియన్ల హాంకాంగ్ డాలర్లు (దాదాపు రూ.6కోట్లు) కలిపి రూ. 253.62 కోట్లకు సమానమని పేర్కొంది.

ఇదీ చదవండి: china-India tension: మిసైల్ పరీక్ష తో మరో కుట్రకు తెరలేపిన డ్రాగన్.. రాఫెల్ తో భారత్ దిమ్మతిరిగే సమాధానం..నీరవ్ మోదీ (51) ప్రస్తుతం యూకేలోని లండన్‌(London) జైలులో జీవితం గడుపుతున్నాడు. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌ (PNB)లో 2 బిలియన్ డాలర్లను రుణాలుగా తీసుకుని ఎగవేసిన మోసం కేసుకు సంబంధించి CBI దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో తనని భారతదేశానికి అప్పగించాలని చేసిన అభ్యర్ధనను కొట్టేయాలని నీరవ్ మోదీ గతంలో యూకే కోర్టును కోరాడు. కానీ అతని అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది. యూకే కోర్టు ఆదేశాలతో లండన్ అధికారులు నీరవ్ మోదీని భారతదేశానికి అప్పగించనున్నారు. అంతకంటే ముందుగా కొన్ని లాంఛనాలను పూర్తిచేయాల్సి ఉంది. అయితే ఈ అప్పగింత ప్రక్రియ యూకేలోని లండన్‌లో చివరి దశలో ఉందని ED తెలిపింది. మరోవైపు ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టం, 2018లోని నిబంధనల ప్రకారం నీరవ్ మోదీ, అతని సహచరుల రూ. 1,389 కోట్ల చర, స్థిరాస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు.

సీజ్ చేసిన కొన్ని ఆస్తులు ఇప్పటికే బాధిత బ్యాంకులకు భౌతికంగా అందించడం జరిగిందని ఏజెన్సీ తెలిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నీరవ్ మోదీ, అతని అంకుల్ మెహుల్ చోక్సీ ఉన్నారు. వీరు ఇతరులతో కలిసి ముంబైలోని బ్రాడీ హౌస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) శాఖ అధికారులని మోసం చేశారనే ఆరోపణలు, మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. డిసెంబరు 2019లో ముంబై PMLA కోర్టు మోదీని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించింది. అదే సంవత్సరం లండన్‌లో అరెస్టయ్యాడు.

Published by:Mahesh
First published:

Tags: Enforcement Directorate, Hong kong, Nirav Modi, Punjab National Bank

ఉత్తమ కథలు