
ప్రతీకాత్మక చిత్రం
రెండో ప్రపంచయుద్ధం నాటిదిగా భావిస్తున్న బాంబు పేలింది. ఈ బాంబు పేలుడులో ఒకరు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు.
రెండో ప్రపంచయుద్ధం నాటిదిగా భావిస్తున్న బాంబు పేలింది. ఈ బాంబు పేలుడులో ఒకరు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. నాగాలాండ్ రాష్ట్రంలో ఈ దుర్ఘటన జరిగింది. నాగాలాండ్‌లోని దిమాపూర్ జిల్లాలో ఓ స్క్రాప్ సేకరించే వ్యక్తి ఆ బాంబును ఇనుప వస్తువుగా భావించి దాన్ని పగల గొట్టడానికి సుత్తితో చాలా సేపు కొట్టాడు. ఆ సమయంలో అది పెద్ద శబ్దంతో పేలింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే చనిపోయాడు. అతడు నివసిస్తున్న ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. స్థానిక బర్మా క్యాంప్‌లో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. అది రెండో ప్రపంచయుద్ధం నాటిదిగా భావిస్తున్నట్టు డిప్యూటీ కమిషనర్ డాక్టర్ నయీమ్ ముస్తఫా చెప్పారు. ఈ ఘటనలో నలుగురు గాయపడగా, అందులో ఓ మహిళ కూడా ఉన్నారు. వారిని ఇరుగుపొరుగువారు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత విచారణ జరగనుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:September 08, 2020, 22:45 IST