World Maritime day: నేడు వరల్డ్ మ్యారిటైమ్ డే.. ఆ కార్మికుల త్యాగాన్ని గుర్తించాలి..

World maritime day 2021: ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా లక్షలాది మంది నావికులు, డాకర్లు, ఫెర్రీ, పోర్ట్ కార్మికులు కష్టాలను గుర్తించి గ్లోబల్ సప్లయి చైన్ ను ముందుకు నడిపించాలని ఆస్ట్రేలియన్ మారిటైం యూనియన్ పిలుపునిచ్చింది.

World maritime day 2021: ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా లక్షలాది మంది నావికులు, డాకర్లు, ఫెర్రీ, పోర్ట్ కార్మికులు కష్టాలను గుర్తించి గ్లోబల్ సప్లయి చైన్ ను ముందుకు నడిపించాలని ఆస్ట్రేలియన్ మారిటైం యూనియన్ పిలుపునిచ్చింది.

  • Share this:
సముద్రాన్ని నమ్ముకుని జీవించే వాళ్లు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. లక్షలాది మంది నావికులు, పోర్టు కార్మికులు, డాకర్లు సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరి ఆర్థిక, సామాజిక ప్రాముఖ్యతను అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ సముద్ర సంస్థ ఏటా వరల్డ్ మారిటైం డేను(ప్రపంచ సముద్ర దినోత్సవం) నిర్వహిస్తోంది. ఈ సారి సెప్టెంబరు 30 గురువారం జరుపుకుంటున్నారు. తాజాగా ఈ సంస్థలో ఆస్ట్రేలియా మారిటైం యూనియన్ కూడా చేరింది.

ఈ దినోత్సవం సందర్భంగా లక్షలాది మంది నావికులు, డాకర్లు, ఫెర్రీ, పోర్ట్ కార్మికులు కష్టాలను గుర్తించి గ్లోబల్ సప్లయి చైన్ ను ముందుకు నడిపించాలని ఆస్ట్రేలియన్ మారిటైం యూనియన్ పిలుపునిచ్చింది. ఆస్ట్రేలియా ఆర్థిక విజయంలో సముద్ర కార్మికులు ముఖ్య పాత్ర పోషించారని తెలిపింది. ఈ విషయంపై ఆస్ట్రేలియా మారిటైం యూనియన్(ఎంయూఏ), అంతర్జాతీయ రవాణా వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ప్యాడీ క్రమ్లిన్ స్పందించారు. ఇనుము, బొగ్గు లాంటి ఇతర ఖనిజాల ఎగుమతి ద్వారా దేశానికి గణనీయమైన సంపదను అందిచడంలో నావికా కార్మికులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

జర్మనీ ఛాన్స్​లర్​ ఎన్నికల్లో హంగ్.. ఏంజెలా మెర్కెల్​ పార్టీకి చుక్కెదురు

"కరోనా కాలంలో సముద్ర కార్మికుల శ్రమించనట్లయితే ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థ క్షీణించి ఉండేది. అంతేకాకుండా ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉపకరణాలు, ఎక్విప్మెంట్, ఉత్పత్తులు తగిన సమయానికి అందేవి కావు. ఇతర దేశాలకు ఎగుమతులు స్తంభించి ఉండేవి" అని కమ్లిన్ స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వందలాది మంది కార్గోషిప్స్ లో చిక్కుంటున్నారని, కొన్ని సందర్భాల్లో 18 నెలల వరకు వారి కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని ఆయన అన్నారు. కరోనా కాలంలో ఈ పరిస్థితి ఇంకా తీవ్రతరమైందని తెలిపారు.

Explained: చైనాలో విద్యుత్‌ సంక్షోభం.. విద్యుత్ కొరతతో అక్కడి పరిశ్రమలు మూతబడుతున్నాయా ?

ఆస్ట్రేలియా ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు, భూభాగాలు సముద్ర కార్మికులపై ఆధారపడి ఉన్నాయని, ఈ కరోనా సంక్షోభంపై అత్యవసరంగా దృష్టి సారించాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. సీఫేరర్లకు టీకాలు వేయడం, ఆరోగ్య సేవలు అందించడం, స్వదేశాలకు పంపే ప్రోటోకాల్స్ ను అమలు చేయడం ముఖ్యమని క్రమ్లిన్ స్పష్టం చేశారు.

Attack on president: ఫ్రాన్స్​ దేశ అధ్యక్షుడు మాక్రాన్​పై దాడి.. అప్రమత్తమైన భద్రతా బలగాలు.. దాడి ఎందుకు చేశారంటే?


ఈ ప్రపంచ సముద్ర దినోత్సవం రోజున బలమైన, విశ్వసనీయమైన, సురక్షితమైన దిశగా దేశీయ షిప్పింగ్ పరిశ్రమను పునరుద్దరించుకోవాలని ఆస్ట్రేలియా మారిటైం యూనియన్ నాయకులకు పిలుపునిచ్చింది. అంతేకాకుండా పోర్టుల్లో పనిచేసే అంతర్జాతీయ నావికా కార్మికుల జీవితాలను మెరుగుపరచాలని తీర్మానించింది.
Published by:Shiva Kumar Addula
First published: