Heart Health Tips : మన శరీరంలో అన్ని అవయవాలూ ముఖ్యమైనవే. ప్రధానంగా... గుండె, కిడ్నీలు, లివర్ వంటివి అత్యంత ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఐతే... అవి ఆరోగ్యంగా ఉన్నాయో లేదో మనకు తెలీదు. ఎందుకంటే మన చేతులూ, కాళ్లలాగా అవి మన కంటికి కనిపించవు కదా. కాబట్టి... వాటి విషయంలో మనం శ్రద్ధ పెట్టుకోవాలి. మంచి ఆహారం తినాలి. ఎక్కువ పోషకాలు, విటమిన్లూ, ఖనిజాలు ఉండే ఆహారం తీసుకోవాలి. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటివి ఉండేవారు... ఇంకా ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి. అధిక బరువు ఉండేవారికి కూడా గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ. అందువల్ల గుండె విషయంలో అందరమూ జాగ్రత్త పడదాం. అందుకు ఏం చెయ్యాలో తెలుసుకుందాం.
1. ఎంత తింటున్నామో గమనించుకోవాలి : మీకు తెలిసే ఉంటుంది... జపనీయులు... చిన్న గిన్నెల్లో ఆహారం తింటారు. ఎందుకంటే... చిన్న ప్లేట్లు, గిన్నెల్లో తక్కువ ఆహారం పడుతుంది. కానీ అవి నిండుగా కనిపిస్తాయి. అందువల్ల అలాంటి వాటిలో తింటే మంచిది. కొంతమంది భోజనం చేసినా... మళ్లీ చిరుతిళ్లవంటివి తింటారు. అలా చెయ్యకూడదు. కావాలంటే... భోజనం కొద్ది కొద్దిగా రెండుసార్లు తినడం బెటర్. ప్రతీ రెండు గంటలకు ఓసారి ఎంతో కొంత ఏదో ఒకటి తినాలి. కానీ... భోజనం వంటివి మరీ ఎక్కువ తినకుండా జాగ్రత్త పడాలి.
2. ఫ్యాట్ ఫుడ్ తగ్గించుకోవాలి : ఫ్రైలు, కేకులు, చాకొలెట్లు, స్వీట్లు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ టేస్టీగా ఉంటాయి. కానీ వీటిలో కొవ్వు ఎక్కువ. అది మన గుండెకు ప్రమాదకరం. ఇవి ఎక్కువగా తింటే... మన రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. ఇవి రక్తాన్ని సరఫరా చేసే ధమనులు, సిరల్లో గడ్డలుగా గూడుకడతాయి. ఏదో ఒక రోజు అదే కొవ్వు... రక్త సరఫరాను అడ్డుకుంటుంది. అంతే హార్ట్ ఎటాక్ వచ్చేస్తుంది. అందు వల్ల మనం డేంజర్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. అవసరమైతే నోరు కట్టేసుకోవాలి. అప్పుడప్పుడూ తింటే పర్లేదు గానీ... రోజూ అలాంటివి తింటే... గుండెకు చేటే.
3. ప్రోటీన్స్ ఎక్కువ ఉండొచ్చు : మాంసం, చికెన్, చేపలు, గుడ్ల వంటివి ప్రోటీన్స్ (మాంసకృత్తులు) ఎక్కువగా ఉండే ఆహారాలు. ఐతే... ఈ ఫుడ్‌లో కూడా బీఫ్ అయితే కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దాని బదులు... చికెన్, మటన్ వంటివి తినడం బెటర్. చేపలు మంచివి. వాటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి కొవ్వు తగ్గిస్తాయి. గింజలు, బఠాణీలు, వేరుశనగ వంటివి కూడా కొద్ది మొత్తాల్లో తీసుకుంటే మేలు.
4. తృణ ధాన్యాలు తప్పనిసరి : రైస్, గోధుమలతోపాటూ రాగులు, జొన్నలు, సజ్జల వంటివి ఈమధ్య కాలంలో ప్రజలు ఎక్కువగా తీసుకుంటున్నారు. నిజానికి అవి అన్నీ తినాలి కూడా. ఇక వాటిలోనూ ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ వచ్చేసింది. అది రేటు ఎక్కువైనా మన శరీరానికి చాలా మంచిదే. ఇలా మనం తినే వాటిలో బ్యాలెన్స్‌డ్ ఫుడ్ ఉండేలా చేసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఒక్కసారి బాడీలో ఏదైనా పార్ట్ పాడైతే... ఇక మనకు కలిగే బాధ అంతా ఇంతా కాదు. ముందే జాగ్రత్త పడాల్సిందే అని అప్పుడు ఎంతో ఫీల్ అవుతాం. ఆ పరిస్థితి రాకుండా చేసుకుందాం. ముందే జాగ్రత్త పడదాం.
5. ఆకుకూరలు, కూరగాయలు మస్ట్ : మీకు "అమృతం" ఫార్ములా తెలుసా. అంటే... మనం తినే ఆహారాల్లో మృతం, అమృతం అని రెండు రకాలుంటాయి. డీప్ ఫ్రై చేసే ఆహారం మృత ఆహారం. అది తినడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. అదే ఆకు కూరలు, కూరగాయలు, కాయలు, పండ్ల వంటివి మృతం కాని... అమృత ఆహారం. అవి ఎంత తింటే అంత మన శరీరానికి మేలు జరుగుతుంది. ఈ ఫార్ములాను పక్కాగా ఫాలో అయిపోండి. అమృతాహారంలో పోషకాలు ఎక్కువ, కొవ్వు తక్కువ. అందువల్ల అవి తింటే.... గుండె మనకు వద్దన్నా థాంక్స్ చెబుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.