హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Medical Alert: నాలుగు భారత దగ్గు టానిక్‌లపై WHO మెడికల్ అలర్ట్.. ఆ సిరప్‌లు ఇవే!

Medical Alert: నాలుగు భారత దగ్గు టానిక్‌లపై WHO మెడికల్ అలర్ట్.. ఆ సిరప్‌లు ఇవే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Medical Alert: భారత్‌కు చెందిన  ఓ ఫార్మా కంపెనీ తయారు చేసిన 4 దగ్గు టానిక్‌లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) మెడికల్ ప్రొడక్ట్ అలర్ట్ జారీ చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

భారత్‌ (India)కు చెందిన ఓ ఫార్మా కంపెనీ తయారు చేసిన 4 దగ్గు టానిక్‌లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) మెడికల్ ప్రొడక్ట్ అలర్ట్ జారీ చేసింది. డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ ఈ విషయమై ట్వీట్ చేశారు. భారతదేశానికి చెందిన ఆ కంపెనీ తయారు చేసిన సిరప్ తాగి ఆఫ్రికాలో 66 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆ ప్రొడక్ట్‌లను ఉపయోగించవద్దని WHO తెలిపింది. చిన్నారులు చనిపోవడానికి కారణమైన ఆ ఫార్మా కంపెనీ ఏది, ఈ సిరప్‌లు తాగిన వారికి వచ్చిన లక్షణాలు ఏంటో చూద్దాం.

* కలుషిత ఔషధాలని ప్రకటన

భారతదేశంలోని హర్యానా కేంద్రంగా పని చేసే మెయిడెన్ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్‌కు WHO బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. ఆ ఫార్మా కంపెనీ తయారు చేసిన నాలుగు కలుషిత దగ్గు టానిక్‌ల వల్ల ఆఫ్రికన్ దేశమైన గాంబియాలో 66 మంది చిన్నారుల మృతి చెందారని, మరికొందరు కిడ్నీ సంబంధిత సమస్యల బారిన పడేందుకు ఈ సిరప్‌లు కారణం అయ్యాయని WHO వెల్లడించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు ఉంటుందని WHO చీఫ్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం అని పేర్కొన్నారు.

* ఆ సిరప్‌లు ఇవే

ప్రొమెథజైన్​ ఓరల్ సొల్యూషన్( Promethazine Oral Solution)​, కాఫెక్స్​మాలిన్ బేబీ కాఫ్​ సిరప్(Kofexmalin Baby Cough Syrup), మాకాఫ్​ బేబీ కాఫ్​ సిరప్(Makoff Baby Cough Syrup), మేగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్( Magrip N Cold Syrup)ల తయారీలో ఫార్మా సంస్థ పూర్తిస్థాయిలో భద్రత, నాణ్యతా ప్రమాణాల్ని పాటించలేదని WHO పేర్కొంది.

నాణ్యతా ప్రమాణాల గురించి ఎలాంటి ఆధారాలు ఫార్మా కంపెనీ సమర్పించలేదని వివరించింది. ఆయా సిరప్‌లలో అధిక మోతాదుల్లో డైఎథిలీన్​ గ్లైకాల్, ఎథిలీన్ గ్లైకాల్ ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అధిక మోతాదుల్లో ఆ రెండూ ఉండటం ప్రమాదకరమని, వాటి వల్ల మరణం సంభవించవచ్చునని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది.

* లక్షణాలు

పైన పేర్కొన్న సిరప్‌లు తీసుకున్న చిన్నారుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాల్సి ఉంటుంది. మూత్ర విసర్జనలో ఇబ్బందులు, కడుపు నొప్పి, వాంతులు, డయేరియా, తల నొప్పి, మానసికంగా అనిశ్చితి, తీవ్రమైన కిడ్నీ సమస్యలు వచ్చి చివరకు మరణానికి దారి తీయవచ్చు. ఆ 4 దగ్గు టానిక్‌లను హానికరమైన ఔషధాలుగా పరిగణించాలని WHO సూచించింది.

* ఇన్వెస్టిగేషన్ స్టార్ట్

ప్రపంచ ఆరోగ్య సంస్థ మెడికల్ ప్రొడక్ట్ అలర్ట్ జారీ చేసిన వెంటనే కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ(CDSCO) కూడా వెంటనే అప్రమత్తమైంది. ఈ విషయమై విచారణ స్టార్ట్ చేసినట్లు తెలిపింది. రాష్ట్ర నియంత్రణ సంస్థతో కలిసి వెంటనే విచారణ ప్రారంభించినట్లు పేర్కొంది. సెప్టెంబర్ 29, 2022న WHO గాంబియాలో చిన్నారుల మృతి గురించి తెలిపిన నాటి నుంచి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) గాంబియాలోని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

చిన్నారుల మృతికి కారణాలను పరిశోధిస్తున్నారు. మెయిడెన్ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్‌ ఇప్పటి వరకు తన ప్రొడక్ట్స్‌ను గాంబియాకు మాత్రమే ఎగుమతి చేసినట్లు తెలుస్తోంది. CDSCO ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. ఇతర దేశాలకు ఎగుమతి చేసిన క్రమంలో ఆ దేశాలు ప్రొడక్ట్ క్వాలిటీ చెక్ చేయాల్సి ఉంటుందని, వారు శాటిస్‌ఫై అయిన తర్వాతనే ఆ దేశంలో ప్రొడక్ట్స్ రిలీజ్ ఉంటుంది. కాగా, గాంబియా దేశంలో ఈ ప్రొడక్ట్స్ యూసేజ్ ముందు టెస్ట్ చేశారా? లేదా? అనేది విచారణలో తేలనుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: International news, National News, WHO

ఉత్తమ కథలు