మాల్దీవులు అధ్యక్షుడికి బ్యాట్ బహూకరించిన మోదీ..ఎందుకంటే

ఇప్పటికే బీసీసీఐ బృందం మాల్దీవుల్లో పర్యటించిందని..కోచింగ్ ప్రోగ్రాంలు, కిట్ల పంపిణీపై అక్కడి అధికారులతో చర్చలు జరిపామన్నారు. అంతేకాదు మాల్దీవుల విజ్ఞప్తి మేరకు అక్కడ క్రికెట్ స్టేడియం నిర్మించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

news18-telugu
Updated: June 8, 2019, 7:08 PM IST
మాల్దీవులు అధ్యక్షుడికి బ్యాట్ బహూకరించిన మోదీ..ఎందుకంటే
మాల్దీవులు అధ్యక్షుడికి బ్యాట్ బహూకరించిన మోదీ
  • Share this:
క్రికెట్ వరల్డ్ కప్ ఫీవర్ యావత్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. సాధారణ ప్రజలే కాదు సినీ, వ్యాపార ప్రముఖులతో పాటు దేశాధినేతలూ ప్రపంచకప్‌ని ఆస్వాదిస్తున్నారు. మాల్దీవుల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఆ దేశాధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలికి బ్యాట్ బహూకరించారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, ధోనీతో పాటు ఇతర సభ్యుల సంతకాలతో కూడిన బ్యాట్‌ను ఆయనకు గిఫ్ట్‌గా ఇచ్చారు. మాల్దీవుల్లో క్రికెట్‌ను ప్రమోట్ చేయడంతో పాటు క్రీడాభివృద్ధికి భారత్ చేయూతనందిస్తుందని హామీ ఇచ్చారు మోదీ.

క్రికెట్ మమ్నల్ని కలిపింది. నా మిత్రుడు సోలి క్రికెట్‌కు వీరాభిమాని. క్రికెట్ ప్రపంచ కప్ జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా సభ్యుల సంతకాలతోక కూడిన బ్యాట్‌ను బహూకరించాను.
నరేంద్ర మోదీ, భారత ప్రధాని

ప్రధాని మోదీని మాల్దీవులు ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. విదేశీయులకు మాల్దీవులు అందించే అత్యున్నత పురస్కారం..''The Most Honourable Order of the Distinguished Rule of Nishan Izzuddeen''తో మోదీని సత్కరించారు అధ్యక్షుడు సోలి.
Loading...
మాల్దీవులు క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు భారత్ సహకరిస్తోంది. అక్కడి క్రికెటర్లకు బీసీసీఐ ద్వారా అత్యుత్తమ శిక్షణను అందిస్తామని భారత విదేశాంగశాఖ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడించారు. ఇప్పటికే బీసీసీఐ బృందం మాల్దీవుల్లో పర్యటించిందని..కోచింగ్ ప్రోగ్రాంలు, కిట్ల పంపిణీపై అక్కడి అధికారులతో చర్చలు జరిపామన్నారు. అంతేకాదు మాల్దీవుల విజ్ఞప్తి మేరకు అక్కడ క్రికెట్ స్టేడియం నిర్మించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

కాగా, ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విదేశీ పర్యటనలో ఉన్నారు మోదీ. భారత్-మాల్దీవుల ద్వైపాక్షిక సంబంధాలపై ఆ దేశాధ్యక్షుడితో చర్చలు జరపనున్నారు. ఏప్రిల్‌లో బెంగళూరులో జరిగిన ఓ ఐపీఎల్ మ్యాచ్‌కు మాల్దీవులు అధ్యక్షుడు హాజరయ్యారు. ఆ సందర్భంగా తమ దేశంలో క్రికెట్ అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. అంతర్జాతీయ క్రికెట్‌కు అవసరమైన ప్రమాణాలు సాధించేలా శిక్షణ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. ఆ మేరకు క్రికెట్ విషయంలో మాల్దీవులకు పూర్తి సహాయ సహకారాలందిస్తోంది భారత్.

First published: June 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...