Vedika: రూ. 16 కోట్ల ఇంజెక్షన్ అందించినా దక్కని చిన్నారి ప్రాణం.. కుటుంబంలో తీరని విషాదం..

(Image-Facebook)

మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. అప్పటివరకు ఉల్లాసంగా ఉన్న పాపకు.. శ్వాస సమస్య తలెత్తింది.

  • Share this:
    ఆ పాప వయసు 13 నెలలు.. అరుదైన వ్యాధితో పోరాటం చేసింది. ఆమె చికిత్స చేయించాలంటే రూ. 16 కోట్లు విలువైన ఇంజెక్షన్ అవసరం వచ్చింది. ఇందుకోసం తల్లిదండ్రులు ఎంతగానో శ్రమించారు. చివరకు దాతల సాయంతో అంత విలువైన ఇంజెక్షన్ అందించినా ఫలితం లేకుండా పోయింది. వివరాలు.. మహారాష్ట్రలోని పుణె జిల్లాల పింప్రి-చించ్వాడ్‌లోని భోసారికి చెందిన వేదిక అనే పాప.. స్పైనల్ మస్క్యులర్ ఆట్రోపీ అనే వ్యాధితో బాధపడసాగింది. చిన్నారి కష్టం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఆమెకు చికిత్స అందించాలంటే.. రూ. 16 కోట్ల ఇంజెక్షన్ కావాల్సి వచ్చింది. దీంతో బాలిక తల్లిదండ్రులు దాతల సాయం కోరారు. అయితే దాతల సాయంతో డబ్బులు సమకూరాయి. వ్యాధిని నయం చేసే జోల్‌గెన్జామా ఓనాసెమ్నోజీని అమెరికా నుంచి జూన్ నెలలో పాపకు అందించారు.

    ఇంజెక్షన్ ఇచ్చిన పాప ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంజెక్షన్ ఇవ్వడానికి ముందుకు చిన్నారి.. మంచం మీదే పడుకునే ఉండేంది. అయితే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆమె కదలికలు చేయసాగింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రుల కొండంత ధైర్యం వచ్చింది. ఈ క్రమంలోనే పాప పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహించారు. అలాగే వైద్యులు చెప్పినట్టుగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు.

    అయితే మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. అప్పటివరకు ఉల్లాసంగా ఉన్న పాపకు.. శ్వాస సమస్య తలెత్తింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పాపను సమీపంలోకి ఆస్పత్రికి తరలించారు. భోసారిలోని ఆస్పత్రిలో పరిస్థితులు చక్కబడ్డ తర్వాత.. పాపను దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రికి తరలించారు. వెంటనే పాపను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే వైద్యులు అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ.. చిన్నారి ప్రాణాలు కాపాడలేకపోయారు. పరిస్థితి విషమించడంతో.. వేదిక ఆదివారం సాయంత్రం కన్నుమూసింది. దీంతో వేదిక కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె బతకాలని కోరకున్న వేలాది మందిని ఈ ఘటన తీవ్రంగా కలిచివేసింది.
    Published by:Sumanth Kanukula
    First published: