Landslide | కొత్త ఏడాది మొదటి రోజే భారీ ప్రమాదం చోటు చేసుకొంది. హర్యాణా (Haryana) లోన భివానీ జిల్లాలోని తోషమ్ బ్లాక్‌లోని దాడం మైనింగ్ జోన్లో కొండచరియలు విరిగిపడటం (Landslide)తో పలువురు మైనింగ్ కార్మికులు చిక్కుకుపోయారని, మరికొందరు చనిపోయారని భావిస్తున్నారు.
కొత్త ఏడాది మొదటి రోజే భారీ ప్రమాదం చోటు చేసుకొంది. హర్యాణా (Haryana) లోన భివానీ జిల్లాలోని తోషమ్ బ్లాక్‌లోని దాడం మైనింగ్ (Mining) జోన్లో కొండచరియలు విరిగిపడటం (Landslide)తో పలువురు మైనింగ్ కార్మికులు చిక్కుకుపోయారని, మరికొందరు చనిపోయారని భావిస్తున్నారు. జిల్లా యంత్రాంగం సహాయక చర్యలను ప్రారంభించగా, మృతుల సంఖ్య ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై తోషమ్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పటికి చిక్కుకున్న వారి సంఖ్యను అధికారులు గుర్తిస్తున్నారని అన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (National Green Tribunal) ఆదేశాల తర్వాత ఈ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలు నిషేధించబడ్డాయని ఆయన అన్నారు. కార్మికుల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతం అధికారులు 3,4 మంది కార్మికులు మృతి చెందినట్టు అధికారుల పేర్కొంటున్నారు.
తోషమ్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి సహాయ చర్యల అసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నిరంతరం అధికారులతో మాట్లాడుతున్నానని వారు సహాయ చర్యలు వేగవంతం చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన చాలా సేపటికి వారు ఘటనా స్థలానికి వచ్చారని ఎమ్మెల్యే అన్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న కేబినెట్ మంత్రి (Cabinet Minister) జేపీ దలాల్ చేరుకొని సహాయ చర్యలను పరిశీలించారు. కొంతమంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు వ్యక్తులను ఆసుపత్రికి తరలించిన్టు సమచారం. ఇక్కడ మైనింగ్ కాంట్రాక్టర్ (Mining Contractor) ప్రకారం, లోపల మరో మూడు-నాలుగు మంది చిక్కుకుపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
అనంతరం మంత్రి జేపీ దలాల్ మాట్లాడారు. వైద్యుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. వీలైనన్ని ఎక్కువ మంది ప్రాణాలను కాపాడేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని అన్నారు. మొత్తం జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ సిబ్బందిని పరిస్థితులు చక్కదిద్దేందుకు రంగంలోకి దించామని అన్నారు. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం చేయగలిగినంత మందిని కాపాడాలి అనేం అంశంపై దృష్టి పెట్టిందని అన్నారు. శిథిలాలను వేగంగా తొలగించి అందులో చిక్కుకొన్న వారిని కాపాడడమే మా లక్ష్యమని ఆయన అన్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.