WORK FROM HOME TO CONTINUE NEXT YEAR GOVT MAY SOON BRING RULES FOR THIS KNOW CHANGES GH VB
New Work Structure: వర్క్ ఫ్రమ్ హోమ్ పై ప్రభుత్వం తీసుకురానున్న నిబంధనలు ఇవే.. వివరాలిలా..
ప్రతీకాత్మక చిత్రం
మహమ్మారి అనంతర పరిస్థితుల నేపథ్యంలో కొత్త వర్క్ మోడల్స్‌పై కేంద్రం లీగల్ ఫ్రేమ్‌వర్క్ రూపొందించాలని బావిస్తోంది. ఇందులో వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్‌తో పాటు ఉద్యోగులు వారంలో నిర్ణీత రోజుల పాటు కార్యాలయానికి వెళ్లాల్సిన హైబ్రిడ్ వర్క్ మోడల్ కూడా ఉంటుంది.
కరోనా తరువాత వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులను కంపెనీలు ఇంటి నుంచి పని చేసేలా ఆదేశాలు జారీ చేశాయి. ఇప్పటికీ చాలా కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు రూపొందించే పనిలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైనట్లు వార్తలు వస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి ఒక సమగ్ర ప్రణాళికను కేంద్రం రూపొందిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2020లో కోవిడ్-19 మహమ్మారి వెలుగుచూసిన తరువాత భారత్‌తో పాటు అనేక దేశాలు వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్‌ను అవలంభిస్తున్నాయి.
అయితే కొరోనావైరస్ కొత్త వేరియంట్ల రూపంలో విజృంభిస్తున్న తరుణంలో ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లడం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎకనామిక్ టైమ్స్(ET)లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. మహమ్మారి అనంతర పరిస్థితుల నేపథ్యంలో కొత్త వర్క్ మోడల్స్‌పై కేంద్రం లీగల్ ఫ్రేమ్‌వర్క్ రూపొందించాలని బావిస్తోంది. ఇందులో వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్‌తో పాటు ఉద్యోగులు వారంలో నిర్ణీత రోజుల పాటు కార్యాలయానికి వెళ్లాల్సిన హైబ్రిడ్ వర్క్ మోడల్ కూడా ఉంటుంది. కరోనావైరస్ నుంచి తమ ఉద్యోగులను రక్షించడానికి కంపెనీలు ఈ వర్క్ మోడల్స్ అనుసరిస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించారని ET రిపోర్ట్ వెల్లడించింది.
ఉద్యోగులకు పని గంటలను నిర్ణయించడం, ఇంటి నుంచి పని చేయడం వల్ల ఇంటర్నెట్, విద్యుత్ అవసరాలకు అయ్యే అదనపు ఖర్చులను చెల్లించడం.. వంటి అంశాలపై కేంద్రం దృష్టి సారించింది. ఈ మోడల్ భవిష్యత్తులో కూడా కొనసాగే అవకాశం ఉన్నందువల్ల, నిర్ణీత ప్రమాణాలను నెలకొల్పేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఒక ప్రభుత్వ అధికారి ETకి వెల్లడించారు. ఈ లీగల్ ఫ్రేమ్‌వర్క్ అన్ని రంగాలకు వర్తిస్తుందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి తెలిపారు.
నిబంధనలపై దేశాల దృష్టి
ఇప్పటికే కొన్ని దేశాలు కొత్త వర్క్ మోడల్‌కు సంబంధించిన చట్టాలను అమలు చేస్తున్నాయి. ఆఫీస్‌లకు రాకుండా రిమోర్ట్ వర్కింగ్ ప్లేస్‌లో పనిచేసే ఉద్యోగులకు ఎక్కువ రక్షణ కల్పించే చట్టాన్ని పోర్చుగల్ ఇటీవల ఆమోదించింది. భారత ప్రభుత్వం కూడా జనవరిలో సర్వీస్ సెక్టార్‌కు వర్తించే వర్క్ ఫ్రమ్ హోమ్ స్ట్రక్చర్‌ను అధికారికంగా వెల్లడించింది. దీని వల్ల యజమానులు, ఉద్యోగులు పరస్పరం పని గంటలను నిర్ణయించుకునే అవకాశం ఉంది.
డెల్టా వేరియంట్ విజృంభణ అనంతరం, కరోనా కేసులు చాలా వరకు తగ్గాయి. దీంతో కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఆఫీస్‌లకు పిలవడం ప్రారంభించాయి. అయితే కొత్తగా వెలుగుచూసిన ‘ఒమిక్రాన్’ వేరియంట్ కేసులు భారత్‌లో రోజురోజుకూ పెరుగున్నాయి. దీంతో కంపెనీలు వేచిచూసే ధోరణిలో ఉన్నాయి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.