హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Work From Home: వారంలో కేసులు పెరిగే అవ‌కాశం ప్రైవేటు ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రం హోం.. ఆదేశాలిచ్చిన ప్ర‌భుత్వం

Work From Home: వారంలో కేసులు పెరిగే అవ‌కాశం ప్రైవేటు ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రం హోం.. ఆదేశాలిచ్చిన ప్ర‌భుత్వం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Work From Home | దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా పాజిటివిటీ రేటు బాగా పెరిగింది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ (Delhi) ప్ర‌భుత్వం తాజా నిర్ణ‌యం తీసుకొంది. క‌రోనా క‌ట్ట‌డికి ఊత‌మిచ్చేలా ప్రైవేటు ఆఫీస్‌లో ప‌ని చేసే ఉద్యోగాలు వ‌ర్క్ ఫ్రం హోం ఇవ్వాల‌ని ఆదేశించింది.

ఇంకా చదవండి ...

దేశంలో క‌రోనా కేసులు (Corona Cases) భారీగా పెరుగుతున్నాయి. ఇక దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ప‌రిస్థితి చెప్ప‌న‌క్క‌ర్లేదు. కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే క‌రోనా పాజిటివిటీ రేటు బాగా పెరిగింది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ (Delhi) ప్ర‌భుత్వం తాజా నిర్ణ‌యం తీసుకొంది. క‌రోనా క‌ట్ట‌డికి ఊత‌మిచ్చేలా ప్రైవేటు ఆఫీస్‌లో ప‌ని చేసే ఉద్యోగాలు వ‌ర్క్ ఫ్రం హోం ఇవ్వాల‌ని ఆదేశించింది. అత్య‌వ‌స‌ర సేవ‌లు మినహా మిగ‌తావాటికి వ‌ర్క్ ఫ్రం ఇవ్వాల‌ని పేర్కొంది. ఈ నిర్ణ‌యం ఢిల్లీ డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ (Delhi Disaster Management) తీసుకొంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఢిల్లీలో రెస్టారెంట్లు, ప్రైవేటు కార్యాల‌యాలు 50శాతం సామ‌ర్థ్యంతో ప‌ని చేసేందుకు అనుమితి ఉంది. తాజాగా ఢిల్లీ డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ వ‌ర్క్ ఫ్రం హోం ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేసింది.

Omicron's Sibling BA.1: భార‌త్‌లో ఒమిక్రాన్ కొత్త వేరియ‌ట్‌ బీఏ.1.. డెల్టాను మించిపోయింది!


ఢిల్లీలో తాజాగా 19 వేల క‌రోనా కేసులు వ‌చ్చాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 17 కరోనా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. వ‌చ్చే వారంలో క‌రోనా కేసులు భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని వైద్య సిబ్బంది అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకొంది.

ప్రపంచవ్యాప్తంగా ఓమిక్రాన్ (Omicron) వేరియంట్‌ల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇటు భార‌త్‌లోనూ డెల్టా వేరియంట్ (Delta Variant) స్థానంలో ఒమిక్రాన్ భ‌ర్తీ చేసింద‌ని డ‌బ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అయితే ఆందోళ‌న క‌లిగించే అంశం ఇండియాలో ఒమిక్రాన్ మ‌రో రూపాంత‌రం చెందింద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. దేశంలో కొత్త వేరియంట్ వ్యాపిస్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. దానిపేరు ఒమిక్రాన్ బీఏ.1 (Omicron BA.1) జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన భారతీయ వైరాలజిస్టులు BA.1 ఓమిక్రాన్ కంటే వేగంగా వ్యాపిస్తోందని పేర్కొన్నారు.

Assembly Elections 2022: అప్పుడు లెక్క‌లేని పార్టీ.. ఇప్పుడు లెక్క‌లు మారుస్తోంది.. ర‌స‌వ‌త్త‌రంగా పంజాబ్ రాజ‌కీయం!


దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు (Corona Cases) భారీగా పెరుగుతున్నాయి. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబాయిలో క‌రోనా ఉధృతి ఎక్కువ‌గా ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో ముంబాయిలో 13,648 కొత్త కోవిడ్ -19 కేసులు వ‌చ్చాయి. 5 మ‌ర‌ణాలు సంభ‌వించిన‌ట్టు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (Brihanmumbai Municipal Corporation) హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. ఒక్క రోజు 59,242 నమూనాలను పరీక్షించగా, పాజిటివిటీ రేటు 23 శాతంగా నమోదైంది. కొత్త కేసులు మునుపటి రోజు కంటే 5,826 తక్కువగా ఉన్నాయి మరియు పాజిటివిటీ రేటు 28 శాతం నుండి 23 శాతానికి 5 శాతం తగ్గింది. అంతే కాకుండా ముంబాయిలో 27,214 డిశ్చార్జ్‌లను నమోద‌య్యాయి

First published:

Tags: Corona cases, Delhi, Omicron, Work From Home

ఉత్తమ కథలు