WORK FROM HOME GOOD NEWS FOR DISABLED PREGNANT WOMEN DELHI GOVERNMENT ANNOUNCED BY WORK FROM HOME EVK
Work From Home: దివ్యాంగులకు.. గర్భిణులకు గుడ్ న్యూస్.. వర్క్ ఫ్రం హౌం ప్రకటించిన ప్రభుత్వం!
ప్రతీకాత్మక చిత్రం
Work From Home | దేశ రాజధానిలో కోవిడ్ 19 కేసులు (Covid 19 Cases) చాలా వేగంగా పెరుగుతున్నాన్నాయి. పాజిటివిటీ రేటు దాదాపుగా 30శాతం ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. కరోనా కట్టడికి ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కీలక ప్రకటన చేసింది.
దేశ రాజధానిలో కోవిడ్ 19 కేసులు (Covid 19 Cases) చాలా వేగంగా పెరుగుతున్నాన్నాయి. పాజిటివిటీ రేటు దాదాపుగా 30శాతం ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. కరోనా కట్టడికి ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (District Disaster Management Authority) కీలక ప్రకటన చేసింది. దివ్యాంగులకు, నగర ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీలలోని గర్భిణీ స్త్రీల ఉద్యోగులను కార్యాలయానికి హాజరు నుంచి మినహాయించింది. వారంతా ఇంటి నుంచే పని చేయవచ్చని పేర్కొంది. దీనికి సంబంధించి డీడీఎంఏ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలు, వికలాంగులు, గర్భిణులు వారి ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని డిపార్ట్మెంట్లు, PSUలు, కార్పొరేషన్లు, స్వయంప్రతిపత్త సంస్థలు, ఢిల్లీ (Delhi) ప్రభుత్వ స్థానిక సంస్థల కార్యాలయాలలో అవసరమైన , ఇతర విభాగాలకు సంబంధించి విధులు నిర్వహిస్తున్న వారందరికీ ఈ రూల్ వర్తించేలా ప్రభుత్వం ఆదేశించింది.
వేగంగా పెరుగుతున్న కేసులు..
దేశంలో గడిచిన 24 గంటల్లో దేశంలో 2,71,202 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 37,122,131 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 15,50,377 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 314 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 486,066 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,38,331 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,45,00,172 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1.56 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 30 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. ఇటు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7,743 గా నమోదు అయింది.
దేశంలో మళ్లీ మూడో వేవ్ (Third Wave) ఉధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ముం బయిలోని జస్లోక్ ఆస్ప త్రి వైద్యు డు డాక్టర్ సంజయ్ నాగ్రాల్, కేరళలోని రాజ్గిరి ఆస్పత్రికి చెందిన డాక్టర్ సిరియక్ ఫిలిప్, బెంగళూరుకి చెందిన డాక్టర్ రాజనీ భట్, యూఎస్, కెనడాకు చెందిన మరికొందరు భారతీయ వైద్యులు సహా మొత్తం 32 మంది వైద్యులు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖలు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కరోనా విషయంలో సెకండ్ వేవ్ (Second Wave) సమయంలో చేసిన తప్పులే ఈ ఏడాదిలోనూ పునరావృతమవుతున్నాయని వైద్యులు (Doctors) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చికిత్స విధానంలో మార్పులు అవసరం అని వారు అభిప్రాయ పడ్డారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.