Home /News /national /

WONT FORGET WHO KILLED BAPU VOWS KERALA GOVT AS IT PRINTS MAHATMA GANDHIS ASSASSINATION ON BUDGET COVER PAGE SK

బడ్జెట్‌ కవర్ పేజీపై గాంధీజీ హత్య ఫొటో.. పార్టీల మాటల యుద్ధం

కేరళ బడ్జెట్ కవర్ పేజీపై గాంధీ హత్యఫొటో

కేరళ బడ్జెట్ కవర్ పేజీపై గాంధీ హత్యఫొటో

శరీరంపై రక్తపు గర్తులు, బుల్లెట్ గాయాలతో గాంధీజీ కింద పడిపోయి ఉన్న ఫొటోను కవర్ పేజీపై ముద్రించారు. గురువారం ఈ బడ్జెట్ పుస్తకాన్ని కేరళ ఆర్థికమంత్రి టీఎం థామస్ ఐజాక్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

    కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తీవ్ర దుమారం రేగుతోంది. బడ్జెట్ బుక్ కవర్ పేజీపై గాంధీజీ హత్య ఫొటోను ముద్రించడం వివాదానికి కారణమైంది. మలయాళ ఆర్టిస్ట్‌ గీసిన మహాత్మగాంధీ హత్య దృశ్యాన్ని కవర్ పేజీపై ముద్రించారు. అందులో శరీరంపై రక్తపు గర్తులు, బుల్లెట్ గాయాలతో గాంధీజీ కింద పడిపోయి ఉన్నారు. ఆయన అనుచరులు చుట్టూ చేరి రోదిస్తున్నారు. గురువారం ఈ బడ్జెట్ పుస్తకాన్ని కేరళ ఆర్థికమంత్రి టీఎం థామస్ ఐజాక్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గాంధీజీని ఎవరిని చంపారో తాము మరచిపోలేదన్న సందేశాన్ని ఇవ్వడానికే కవర్ పేజీపై ఆ ఫొటోను ముద్రించినట్లు వెల్లడించారు.

    అవును. గాంధీజీని హత్యచేసిన విషయాన్ని మేం గుర్తు చేసుకున్నాం. గాంధీజీని హిందూ మతోన్మాదుల చంపేశారు. మహాత్ముడిని చంపిన వాళ్లే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. గాంధీ హత్యను మరచిపోలేన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే బడ్జెట్ కవర్ పేజీపై ఆ ఫొటోను ముద్రించాం.
    థామస్ ఐజాక్


    కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ ఇటీవల ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీది మహాత్మాగాంధీని చంపిన హంతకుడు గాడ్సే భావజాలమని మండిపడ్డారు. ఇక ఆర్థికమంత్రి ఐజాక్ సైతం మోదీని టార్గెట్ చేశారు. గాడ్సే భావజాలాన్ని సజీవంగా ఉంచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. అందుకోసమే CAA తీసుకొచ్చారని విమర్శలు గుప్పించారు.

    ఐతే కేరళలోని సీపీఎం ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. వామపక్ష పార్టీలు విలువలు లేని రాజకీయం చేస్తున్నారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. అటు కేరళలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ సైతం వామపక్ష ప్రభుత్వంపై విరుచుకుపడింది. గాంధీజీని రాజకీయాల కోసం వాడకూడదని.. ఆయన ప్రజలందరి గుండెల్లో ఉన్నారని IUML నేత ఎంకే మునీర్ అన్నారు. బడ్జెట్ కవర్ పేజీపై బుల్లెట్ గాయాలతో ఉన్న గాంధీ ఫొటోను వాడడం సమంజసం కాదని విమర్శించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Kerala, Mahatma Gandhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు