హోమ్ /వార్తలు /జాతీయం /

Women's Day Google Doodle: గూగుల్ స్పెషల్ డూడుల్ చూశారా ?

Women's Day Google Doodle: గూగుల్ స్పెషల్ డూడుల్ చూశారా ?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్

ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకొనే ప్రముఖ భాషాల్లో మహిళలను ఏమంటారో ప్రస్తావిస్తూ... డూడుల్‌ను ఏర్పాటు చేసింది గూగుల్. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూతో కలిపి మొత్తం 11 భాషాల్లో మహిళ పేరును ప్రస్తావిస్తూ డూడుల్ పెట్టింది.

    అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని.... సెర్చ్ ఇంజన్ గూగుల్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. ఉమెన్స్ డే సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకించి ఓ ప్రత్యేక డూడుల్‌ను పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకొనే ప్రముఖ భాషాల్లో మహిళలను ఏమంటారో ప్రస్తావిస్తూ... డూడుల్‌ను ఏర్పాటు చేసింది గూగుల్. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూతో కలిపి మొత్తం 11 భాషాల్లో మహిళ పేరును ప్రస్తావిస్తూ డూడుల్ పెట్టింది.


    అంతేకాదు గూగుల్ (GOOGLE)స్పెల్లింగ్‌లో రెండు ‘O’ వద్ద క్లిక్ బటన్ చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే... మహిళలకు సంబంధించి ప్రముఖ రచయితలు, సెలబ్రిటీలు చెప్పిన కోటేషన్స్‌ను చూపిస్తుంది. వీటిలో రష్యన్, ఫ్రాన్స్, బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ నవలా రచయితల కొటేషన్స్‌ను చూపించిది. మహిళలను ఉద్దేశించి ఇండియన్ బాక్సర్ మేరికోమ్ ఇచ్చిన కొటేషన్‌ను కూడా పబ్లిష్ చేసింది. ప్రత్యేక సందర్భాల సమయంలో ప్రముఖ సెర్చ్ ఇంజన్ అయిన గూగుల్ ఇలా స్పెషల్ డూడుల్ పెట్టి తమ అభినందల్ని, శుభాకాంక్షల్ని తెలియజేస్తుంటుంది. అంతకుముందు రిపబ్లిక్ డే సందర్భంగా గూగుల్ ఏర్పాటు చేసిన డూడుల్ కూడా అందరి దృష్టి ఆకర్షించింది.

    First published:

    Tags: Google, Google Doodle, Women's day

    ఉత్తమ కథలు