Home /News /national /

WOMEN POLICEMEN WILL ALSO BE INVOLVED IN PATROLLING IN MYSORE THE KARNATAKA POLICE PLANNING PRV

Women Police: పోలీసు శాఖ సంచలన నిర్ణయం.. ఇక ఆ ప్రాంతంలో రాత్రి పెట్రోలింగ్​కు మహిళా పోలీసుల విధులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పెట్రోలింగ్ (patrolling) అంటే కేవలం మగ పోలీసులు (men police) మాత్రమే నిర్వహించేవారు. అయితే కర్ణాటలక పోలీసు శాఖ మరో అడుగు ముందుకేసింది. ఇకనుంచి మహిళలు (women) కూడా పెట్రోలింగ్​లో పాల్గొంటారని తెలిపింది.

    పెట్రోలింగ్ (patrolling) అంటే కేవలం మగ పోలీసులు (men police) మాత్రమే నిర్వహించేవారు. అయితే కర్ణాటక పోలీసు శాఖ మరో అడుగు ముందుకేసింది. ఇకనుంచి మహిళలు (women) కూడా పెట్రోలింగ్​లో పాల్గొంటారని తెలిపింది. ఇందులో భాగంగా బుధవారం రాత్రి మైసూరు (Mysore)లోని నంజనగూడు పోలీస్‌ ఉప విభాగం పరిధిలో మహిళా పోలీసులు (women police) రాత్రి గస్తీ విధులు నిర్వహించారు. బుధవారం రాత్రి 9 గంటలనుంచి గురువారం తెల్లవారుజామున 6 గంటలవరకు విధులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆర్‌.చేతన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొదటిసారిగా ప్రయోగాత్మకంగా మహిళా పోలీసులను రాత్రి గస్తీ విధులకు పంపగా వారు ధైర్యంగా విధులు నిర్వహించారన్నారు.

    తెలంగాణలో..

    అయితే శాంతిభద్రతలు, ఈవ్ టీజింగ్‌, మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ  (Telangana)ప్రభుత్వం ఈ దిశలో గతంలోనే నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ‘‘విమెన్ ఆన్ వీల్స్’’ అనే వినూత్న కార్యక్రమాన్ని గతంలోనే ప్రారంభించింది. దీని ప్రకారం హైదరాబాద్‌లో మహిళా కానిస్టేబుల్స్ మోటారు సైకిళ్లపై పెట్రోలింగ్‌ (patrolling) నిర్వహిస్తారు. నగరంలో మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడానికి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు ఇంతకుముందు పోలీసులు తెలిపారు. 20 టీం మహిళా కానిస్టేబుల్స్ హైదరాబాద్‌లోని 17 సబ్‌ డివిజన్లలో పెట్రోలింగ్‌లో పాల్గొంటారని పోలీసులు గతంలోనే తెలిపారు.

    పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ (police emergency numbers) అయిన 100కు వచ్చే ఫోన్‌ కాల్స్‌ని కూడా వీరు స్వీకరించి మహిళలకు అండగా నిలుస్తారని తెలిపారు. ఎవరైనా ఈవ్ టీజింగ్ చేసినా లేదంటే అసభ్యంగా ప్రవర్తించినా వెంటనే 100కు డయల్ చేయాలని తెలంగాణ పోలీసులు గతంలోనే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘విమెన్ ఆన్ వీల్స్’’కు ముందు 47 మంది మహిళా కానిస్టేబుళ్లను ఎంపిక చేసి, వారికి రెండు నెలల పాటు పెట్రోలింగ్, బ్లూకోట్స్ విధి, డ్రైవింగ్ నైపుణ్యం, డయల్ 100 నుంచి వచ్చే సమాచారంతో ఘటనాస్థలికి ఎలా చేరుకోవాలని అన్న వాటిపై శిక్షణ ఇచ్చారు.

    గతంలో కేరళలో..

    అతివలను రక్షించేందుకు కేరళలోని వామపక్ష ప్రజాతంత్ర కూటమి ప్రభుత్వం గతంలోనే శ్రీకారం చుట్టింది. బహిరంగ ప్రదేశం కావొచ్చు లేదా డిజిటల్‌ ప్రాంతం కావొచ్చు మహిళలకు రక్షణ కరువైతే చాలు... అండగా నిలవనున్నారు కేరళ (Kerala) పోలీసులు. మహిళలకు రక్షణ కల్పించేందుకు 'పింక్‌ ప్రొటెక్షన్‌ (Pink protection)' పేరుతో ఒక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 10 కార్లు, బుల్లెట్‌ బైక్స్‌తో సహా 40 ద్విచక్ర వాహనాలు, 20 సైకిళ్లను కేటాయించారు. ఈ పింక్‌ ప్రొటెక్షన్‌ ప్రాజెక్టు లక్ష్యమేమిటంటే... మహిళలపై జరుగుతున్న అకృత్యాలు... వరకట్న వేధింపులకు సంబంధించిన సమస్యలు, సైబర్‌, బహిరంగ ప్రదేశాల్లో హింసను నిరోధించడం. ఈ ప్రాజెక్టులో మొత్తం 10 భాగాలున్నాయి. వాటిలో ఒకటి ప్రస్తుతం ఉన్న పింక్‌ పోలీస్‌ పెట్రోల్‌ వ్యవస్థను యాక్టివేట్‌ చేస్తుంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Mysore, Police, Women

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు