కేజ్రీవాల్‌పై మండిపడుతున్న మహిళా నెటిజన్స్..ఎందుకంటే?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టడంలో మహిళలకు కీలక భూమిక పోషించారు. అయితే కేజ్రీవాల్ కొత్త కేబినెట్‌లో మహిళలు ఎవరికీ ప్రాతినిధ్యం కల్పించడం లేదన్న కథనాలపై మహిళా నెటిజన్లు మండిపడుతున్నారు.

news18-telugu
Updated: February 15, 2020, 1:32 PM IST
కేజ్రీవాల్‌పై మండిపడుతున్న మహిళా నెటిజన్స్..ఎందుకంటే?
ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా ( Image credit: PTI)
  • Share this:
కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించి అధికార పగ్గాలు కైవసం చేసుకోవడంలో మహిళలు కీలక పాత్ర పోషించారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆప్ నేతలు మహిళా సంబంధింత అంశాలను హైలైట్ చేశారు. మహిళా రక్షణ, మహిళలకు ఉచిత బస్ పాస్‌లు కల్పిస్తామన్న హామీలకు తోడు  ఉదయాన్నే వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆప్ నేతలు మహిళలకు సూచించారు. మీరు ఆప్‌కి ఓటు వేయడమే కాదు...మీ ఇంట్లో మగాళ్లను కూడా ఆప్‌కు ఓటువేసేలా ఒప్పంచాలన్న ఆప్ అధినేత కేజ్రీవాల్ పిలుపునివ్వడంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడడం తెలిసిందే. అంతకు ముందు ఆప్ మహిళా నేతలు కూడా ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు.

సీన్ కట్ చేస్తే...ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఇప్పుడు ఆప్ వైఖరి మహిళల పట్ల పూర్తిగా మారిపోయింది. కేజ్రీవాల్ కొత్త కేబినెట్‌లో ఒక్క మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో మహిళల జపం చేసిన కేజ్రీవాల్ ఇప్పుడు మంత్రి పదవుల కేటాయింపులో మాత్రం మహిళలకు మొండిచెయ్యి చూపుతున్నారని మహిళా ఓటర్లు మండిపడుతున్నారు.

అటు సోషల్ మీడియా వేదికగానూ మహిళా నెటిజన్స్...కేజ్రీవాల్ నిర్ణయాన్ని తూర్పారబడుతున్నారు. కేజ్రీవాల్ కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించకపోవడం సరికాదంటున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ 62 స్థానాల్లో గెలుచుకోగా...ఇందులో 8 మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో మహిళల చేత ఆప్‌కు ఓటు వేయించడంలో ఆ పార్టీ మహిళా నేతలు కూడా తీవ్రంగా శ్రమించారు. ఆప్ ఎమ్మెల్యేలుగా అతిషి తదితరులు ఉన్నా..మంత్రివర్గంలో వారిని ఎందుకు తీసుకోవడం లేదని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అర్వింద్ కేజ్రీవాల్ మూడోసారి రేపు(ఆదివారం) రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల్లో గెలిచిన ఏడుగురు సిట్టింగ్ మంత్రులకు తిరిగి తన కొత్త కేబినెట్‌లో చోటు కల్పించాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.




First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు