Pini Village: భారత దేశం అనేక సంస్కృతులు.. సంప్రదాయాల సమాహారం..! ఇక్కడ ఎన్నో మతాలు..కులాల ప్రజలు నివసిస్తున్నారు. వారంతా ఇప్పటికీ తమ కట్టుబాట్లను పాటిస్తూ.. జీవిస్తున్నారు. అందులో కొన్ని వింత సంప్రదాయాలు కూడా ఉన్నాయి. మనదేశంలోని ఓ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించరు. పురుషులకు కూడా కొన్ని కఠినమైన నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ ఊరి పేరు పిని. హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని కులు జిల్లాలో ఉంటుంది. ఈ గ్రామంలోని మహిళా సంవత్సరంలో ఐదు రోజుల పాటు దస్తులు ధరించరు. ఏటా శ్రావణ మాసంలో ఐదు రోజుల పాటు నగ్నంగా ఉంటారు. ఐతే ఒంటిపై చున్నీలాంటివి కప్పకోవచ్చు. ఈ ఐదు రోజులు వారు ఇంటి నుంచి బయటకు రారు. భార్యభర్తలు ఒకరితో మరొకరు మాట్లాడుకోరు. పరస్పరం దూరంగా ఉండాలి. కనీసం చూసి నవ్వకూడదట.
Photos - Pink Bangalore : పింక్ కలర్‌లో కనిపిస్తున్న బెంగళూరు
ఐతే నేటి తరం యువత మాత్రం ఈ సంప్రదాయాన్ని పెద్దగా పాటించడం లేదు. పూర్తి నగ్నంగా కాకుండా.. పలుచుటి వస్త్రాలను ధరిస్తారు. కానీ పెద్ద వారు మాత్రం నేటికి.. శతాబ్ధాల నాటి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. శ్రావణ మాసంలో ఐదు రోజుల పాటు నగ్నంగా ఉంటారు. పురుషులక కూడా కొన్ని కఠిననియమాలు ఉన్నాయి. వారు ఐదు రోజుల పాటు మదయం తాగకూడదు. మాంసం ముట్టుకోకూడదు. వీటిని పాటించకపోతే.. దేవుళ్లకు కోపం వచ్చి కీడు చేస్తుందని పినీ వాసులు నమ్ముతారు. ఈ రెండు సంప్రదాయాలను అనుసరించడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది.
ఎలా మొదలైంది.?
పిని గ్రామంలో చాలా కాలం క్రితం రాక్షసులు తిరిగేవట. ఆ రాక్షసులు గ్రామంలోని మహిళల దుస్తులను చిరిపేసి.. తీసుకెళ్లేవారట. వారి నుంచి గ్రామస్తులను రక్షించేందుకు 'లహువా ఘోండ్' అనే దేవత పిని గ్రామానికి వచ్చింది. ఆ దేవత రాక్షసులను చంపి.. పిని ప్రజలను కాపాడింది. భాద్రపద మాసం తొలి రోజు ఈ ఘటన జరిగిందట. ఆ తర్వాత నుంచి.. ఏటా శ్రావణ మాసంలో 5 రోజుల పాటు స్త్రీలు దుస్తులు ధరించకూడదనే సంప్రదాయం మొదలైందట. స్త్రీలు బట్టల్లో అందంగా కనిపిస్తే... రాక్షసులు వచ్చి ఎత్తుకుపోతారని ప్రజలు నమ్ముతారు. ఆ 5 రోజుల్లో పిని గ్రామ ప్రజలు బయటి వ్యక్తులను గ్రామంలోకి రానివ్వరు. ఈ ప్రత్యేక పండుగలో వేరే గ్రామాలకు చెందిన వారు పాల్గొనడానికి వీల్లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Himachal Pradesh