బెంగళూరు టు ఢిల్లీ.. విమానంలోనే ప్రసవించిన మహిళ

ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానం ఒకటి బెంగళూరుకు బయలుదేరింది. విమానం గాలిలో ప్రయాణిస్తుండగా.. అందులో ఉన్న ఒక నిండు గర్భిణీకి ఉన్నట్టుండి పురిటి నొప్పులు మొదలవడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.

news18
Updated: October 8, 2020, 11:58 AM IST
బెంగళూరు టు ఢిల్లీ.. విమానంలోనే ప్రసవించిన మహిళ
ప్రతీకాత్మకచిత్రం
  • News18
  • Last Updated: October 8, 2020, 11:58 AM IST
  • Share this:
బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో ఒక మహిళ పండంటి పసిబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఇండిగో తెలిపింది. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఇండిగో 6E 122.. గాలిలో ప్రయాణిస్తుండగానే ఆ మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో విమానంలో ఉన్న వైద్య సిబ్బంది.. వెంటనే స్పందించారు. ఆమెను ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి పురుడు పోశారు. ఆ మహిళ.. మగబిడ్డకు జన్మనిచ్చింది. విమానంలో ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి 7:40 గంటలకు బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఇందుకు సంబంధించి ఇండిగో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని ప్రకటించింది.

మహిళకు డెలివరీ ప్రక్రియ జరిగేప్పుడు విమానంలో ప్రయాణికుల ఇతర సేవలకు ఇబ్బంది కలగకుండా వైద్య సిబ్బంది, ఇతర స్టాఫ్ చూసుకున్నారని ఇండిగో వివరించింది. గర్భిణీకి అండగా నిలిచిన విమాన, వైద్య సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపింది. పాపకు జన్మనిచ్చిన మహిళ కూడా.. ఇండిగో సిబ్బందికి ధన్యవాదాలు తెలిపింది.
ఇదే విషయాన్ని ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఒక ట్విట్టర్ యూజర్ కూడా పోస్ట్ చేశారు. పసిబిడ్డకు ప్రాణం పోసిన డాక్టర్ శైలజ వల్లభానిని ప్రత్యేకంగా అభినందించారు.
Published by: Srinivas Munigala
First published: October 8, 2020, 11:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading