WOMEN EMPOWERMENT INDIA BEATS CHINA BECOMES MEMBER OF UNITED NATIONS ECOSOC
India Beats China: అంతర్జాతీయ వేదికపై చైనాను ఓడించిన భారత్...
ప్రతీకాత్మక చిత్రం
India Beats China: మహిళా సాధికారత(Women empowerment) వ్యవహారంలో అంతర్జాతీయ వేదికపై చైనాను భారత్ ఓడించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఎకనామిక్ అండ్ సోషియల్ కౌన్సిల్(ECOSOC)లో అంతర్భాగమైన కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్(CSW)లో భారత్ సభ్యత్వాన్ని దక్కించుకుంది.
మహిళా సాధికారత వ్యవహారంలో అంతర్జాతీయ వేదికపై చైనాను భారత్ ఓడించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఎకనామిక్ అండ్ సోషియల్ కౌన్సిల్(ECOSOC)లో అంతర్భాగమైన కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్(CSW)లో భారత్ సభ్యత్వాన్ని దక్కించుకుంది. 2021 నుంచి 2025 వరకు నాలుగేళ్ల పాటు భారత్ ఇందులో సభ్యదేశంగా పనిచేయనుంది. సీఎస్డబ్ల్యూలో భారత్కు సభ్యత్వం లభించడమంటే మహిళా సాధికారత దిశగా భారత ప్రభుత్వానికున్న చిత్తశుద్దికి దక్కిన గుర్తింపుగా ఐరాసలో భారత శాశ్విత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి హర్షం వ్యక్తంచేశారు. ఈ విషయంలో భారత్కు మద్ధతు తెలిపిన సభ్యదేశాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
#BREAKING: India wins seat in prestigious #ECOSOC body by defeating China at @UN. India, Afghanistan, China contested elections. India & Afghanistan won, China couldn't get enough votes. India elected Member of Commission on Status of Women #CSW. Congrats, @ambtstirumurti! 🇮🇳 pic.twitter.com/YyDx0HleAL
సీఎస్డబ్ల్యూలో సభ్యత్వం కోసం ప్రధానంగా మూడు ఆసియా దేశాలు భారత్, చైనా, ఆఫ్గనిస్థాన్ మధ్య పోటీ నెలకొంది. భారత్, ఆఫ్గనిస్థాన్కు ఇందులో చోటు దక్కగా...తగిన ఓట్లు దక్కకపోవడంతో చైనాకు సభ్యత్వం దక్కలేదు. మొత్తం 54 సభ్యదేశాలు ఓటింగ్లో పాల్గొనగా అత్యధిక దేశాలు చైనాకు వ్యతిరేకంగా ఓటువేశాయి. దీంతో చైనా భారత్కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది.
45 ఐరాస సభ్యదేశాలకు సీఎస్డబ్ల్యూలో సభ్యత్వం ఉంటుంది. లింగ సమానత్వం, మహిళా సాధికారత, మహిళా హక్కులు, మహిళల జీవన ప్రమాణాలు పెంపొందించడం కోసం ఇది కృషిచేస్తుంది. దీనికి సంబంధించి ఆయా దేశాలు చేపట్టే కార్యక్రమాలకు సీఎస్డబ్ల్యూ నిధులను కేటాయిస్తుంది. ఇందులో సభ్యత్వం పొందడం ద్వారా మహిళా సాధికారికత కోసం భారత్ చేపట్టే కార్యక్రమాలకు సీఎస్డబ్ల్యూ నుంచి మరిన్ని నిధులు అందే అవకాశముంది.
ఆఫ్రికా నుంచి 13 దేశాలు, ఆసియా నుంచి 11, లాటిన్ అమెరికా, కరేబియన్ నుంచి 9, పశ్చిమ ఐరోపా నుంచి 8, తూర్పు ఐరోపా నుంచి 4 దేశాలు సీఎస్డబ్ల్యూలో సభ్య దేశాలుగా ఉంటాయి.
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.