జీన్స్ ప్యాంట్,స్లీవ్‌లెస్‌లో వెళ్తే.. ఊహించని షాక్ ఇచ్చిన ఆర్టీవో అధికారులు..

ఆర్టీవో అనేది ప్రభుత్వ కార్యాలయం అని..అలాంటిచోటుకు సరైన డ్రెస్సింగ్‌తో రావాలని కోరితే తప్పేంటని అక్కడి అధికారులు అంటున్నారు.

news18-telugu
Updated: October 23, 2019, 8:58 AM IST
జీన్స్ ప్యాంట్,స్లీవ్‌లెస్‌లో వెళ్తే.. ఊహించని షాక్ ఇచ్చిన ఆర్టీవో అధికారులు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 23, 2019, 8:58 AM IST
జీన్స్ ప్యాంట్ ధరించి డ్రైవింగ్ టెస్టుకు వెళ్లిన ఒక అమ్మాయికి చెన్నై ఆర్టీవో అధికారులు షాక్ ఇచ్చారు.జీన్స్‌,స్లీవ్‌లెస్‌లో వచ్చినందుకు సదరు మహిళా టెక్కీని డ్రైవింగ్ టెస్టుకు అనుమతించలేదు. సరైన డ్రెస్‌లో రావాలంటూ ఆమెను అక్కడినుంచి పంపించేశారు. క్యాప్రి ప్యాంట్ ధరించి వచ్చిన మరో మహిళను కూడా అలాగే వెనక్కి పంపించారు.మహిళలనే కాదు లుంగీ,షార్ట్స్ ధరించి వచ్చే అబ్బాయిలను కూడా డ్రైవింగ్ టెస్టుకు అనుమతించట్లేదని అక్కడి ఆర్టీవో అధికారులు తెలిపారు.

ప్రతీరోజూ రకరకాల వ్యక్తులు ఆర్టీవో కార్యాలయానికి వస్తుంటారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవద్దన్న ఉద్దేశంతోనే.. సరైన డ్రెస్‌లో రావాలని సూచిస్తున్నాం. మహిళలు,పురుషులు ఇరువురికి ఇది వర్తిస్తుంది.
ఆర్టీవో కార్యాలయం,కెకె నగర్,చెన్నై


ఆర్టీవో అధికారులు డ్రెస్సింగ్‌పై ఇలాంటి సూచనలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ఆర్టీవో అనేది ప్రభుత్వ కార్యాలయం అని..అలాంటిచోటుకు సరైన డ్రెస్సింగ్‌తో రావాలని కోరితే తప్పేంటని అక్కడి అధికారులు అంటున్నారు. ఏదేమైనా ఆర్టీవో కార్యాలయంలో డ్రెస్ కోడ్‌ పాటించాలని సూచించడం చర్చనీయాంశంగా మారింది.

First published: October 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...