బెంగళూరులోని రైల్వేస్టేషన్లలలో ఒకే తరహా హత్యలు సంచలనం రేపుతున్నాయి. సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ వద్ద ప్లాస్టిక్ స్టోరేజీ డ్రమ్ములో కుళ్లిపోయిన గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని రైల్వే పోలీస్ ఫోర్స్ (RPF) గుర్తించింది. ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్ పక్కన ఉన్న డ్రమ్ము నుంచి దుర్వాసన వస్తుండటంతో టెర్మినల్ వద్ద ఉన్న RPF సిబ్బందికి అనుమానం వచ్చింది. ఈ విషయం గురించి బైయప్పనహళ్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి డ్రమ్ము ఓపెన్ చేయగా మహిల మృతదేహం బయటపడింది. చనిపోయిన మహిళ వయస్సు 32-35 ఏళ్ల మధ్య ఉంటుందని కర్ణాటక రైల్వేస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్.కె సౌమ్యలత తెలిపారు. మృతురాలు ఎవరనేది గుర్తించాల్సి ఉంది. అయితే ఈ తరహాలో హత్య జరగడం మూడు నెలల్లో ఇది మూడో సారి. అది కూడా మూడు మృతదేహాలు రైల్వేస్టేషన్‌లోనే దొరికాయి.. చనిపోయిన ముగ్గురూ మహిళలే
జనవరిలోనూ ఇదే తరహా హత్య:
గతంలోనూ ఇదే తరహా హత్య జరగడంతో పోలీసులు ఇదంతా ఒక గ్రూప్ పనిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత జనవరి 4న యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్‌లోని ఒకటో నెంబర్ ఫ్లాట్‌ఫాం వద్ద మహిళ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. పాలిథీన్ కవర్‌లో ఆమె శవాన్ని చుట్టి ఆ తర్వాత డ్రమ్ములో కుక్కారు. అప్పుడు మృతిచెందిన మహిళ వయస్సు సుమారు 20 ఏళ్లకుపైగా ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం నుంచి తీసుకొచ్చారన్న అనుమానాలు వ్యక్తం చేశారు పోలీసులు. అక్కడ చంపేసి.. ఇక్కడ రైల్వేస్టేషన్‌లో పడేసినట్లు అనుమానిస్తున్నారు.
డిసెంబర్‌లోనూ సేమ్ సీన్:
గత ఏడాది డిసెంబర్‌లో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. డిసెంబరు రెండవ వారంలో, SMVT రైల్వే స్టేషన్‌లోని ప్యాసింజర్ రైలు కోచ్‌లో పసుపు గోనె సంచిలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. లగేజీతో పడేసిన సంచి నుంచి దుర్వాసన వస్తోందని ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి తనిఖీ చేయగా.. బాగా కుళ్లిపోయిన అవశేషాలు బయటపడ్డాయి. ఇలా ఓకే తరహా హత్యలు ఎవరు చేస్తున్నరన్నదానిపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఒకే ముఠా ఈ హత్యలకు పాల్పడుతుందానని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే స్టేషన్ ప్రాంగణంలోని సీసీటీవీలను పోలీసులు పరీశిస్తున్నారు. ఇక జరిగిన మూడు హత్యలు మహిళలవే కావడంతో సైకో పనిగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఏపీ, కర్ణాటకలో మహిళల మిస్సింగ్ కేసులపై ఫోకస్ పెంచారు. రెండు రాష్ట్రాల్లోని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.