బరితెగించిన పాకిస్థాన్...పూంఛ్ సెక్టార్లో కాల్పులు...మహిళ మృతి

ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఉగ్రవాదులను సరిహద్దు గుండా భారత్ లో ప్రవేశించేలా చేసి దాడులకు కుట్ర రచిస్తోంది.

news18-telugu
Updated: October 15, 2019, 11:01 PM IST
బరితెగించిన పాకిస్థాన్...పూంఛ్ సెక్టార్లో కాల్పులు...మహిళ మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సరిహద్దుల్లో పాకిస్థాన్ సైనికులు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా పూంచ్ సెక్టార్‌లో పాక్ దళాలు కాల్పులు జరపగా, ఓ మహిళ చనిపోయింది. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఉగ్రవాదులను సరిహద్దు గుండా భారత్ లో ప్రవేశించేలా చేసి దాడులకు కుట్ర రచిస్తోంది. ఈ క్రమంలోనే భారత సరిహద్దుపై పాక్ సైనికులు కాల్పులకు దిగుతున్నారు. పూంచ్ సెక్టార్ లో పాక్ సైనికుల కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టామని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే సరిహద్దు వెంబడి భారత్ లో ప్రవేశించేందుకు సుమారు 500 మంది తీవ్రవాదులు సిద్ధంగా ఉన్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీరందరినీ కాశ్మీర్ లోయలోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటామని ఇప్పటికే సైన్యం తెలిపింది.
First published: October 15, 2019, 10:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading