40 ఏళ్ల తరువాత ఇంటికి వచ్చిన 90 ఏళ్ల బామ్మ

1979-80 ప్రాంతంలో మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లాలో పంచూబాయీ ఓ లారీ డ్రైవర్‌కు కనిపించింది.

news18-telugu
Updated: June 20, 2020, 8:10 PM IST
40 ఏళ్ల తరువాత ఇంటికి వచ్చిన 90 ఏళ్ల బామ్మ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహారాష్ట్రకు చెందిన పంచూబాయీ 40 ఏళ్ల తరువాత నాగ్‌పూర్‌లోని తన మనవడి నివాసానికి చేరుకుంది. అయితే ఆమె కుమారుడు మూడేళ్ల క్రితం చనిపోయాడు. 1979-80 ప్రాంతంలో మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లాలో పంచూబాయీ ఓ లారీ డ్రైవర్‌కు కనిపించింది. తేనే టీగలు కరవడంతో ఆ మహిళ పరిస్థితి అప్పట్లో ఏమీ బాగోలేదని లారీ డ్రైవర్ కుమారుడు ఇస్రార్ ఖాన్ తెలిపాడు. ఇస్రార్ ఖాన్ తండ్రి అయిన లారీ డ్రైవర్ పంచూబాయీని తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పుడు తాను కూడా చిన్నవాడినని ఇస్రార్ ఖాన్ తెలిపాడు. పంచూబాయీని తాము అచ్చాన్ మౌసి అని పిలిచేవారమని... మతిస్థిమితం సరిగ్గా లేని ఆమె మరాఠిలో మాట్లాడినా తమకు అర్థమయ్యేది కాదని చెప్పాడు. ఆమె గురించి గతంలో ఫేస్ బుక్‌లో ప్రస్తావించినప్పటికీ స్పందన రాలేదు.

అయితే ఈ ఏడాది మే నెలలో ఆమె తన ఊరు పేరు పర్సాపూర్ అని చెప్పడంతో... అది మహారాష్ట్రలో ఉన్నట్టు తాము గుర్తించారు. పర్సాపూర్‌లోని ఓ వ్యాపారిని తాము కలుసుకున్నామని... అతడికి విషయం చెప్పడంతో అతడు ఆమె గురించి తమ ప్రాంతంలోని ఓ వాట్సప్ గ్రూప్‌లో షేర్ చేశాడని ఇస్రార్ ఖాన్ తెలిపాడు. దీంతో పంచూబాయీ కుటుంబం ఆచూకీ దొరకడంతో అతడి మనవడి ఇంటికి పంచూబాయీని పంపించారు. 1979లో తన నానమ్మకు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో ఆమెకు నాగ్‌పూర్‌లో చికిత్స చేయించామని... అక్కడే ఆమె తప్పిపోయిందని బామ్మ మనవడు తెలిపాడు. తన తండ్రి కొన్నేళ్లపాటు ఆమె గురించి వెతికినా ఫలితం లేకపోయిందని... ఇన్నేళ్ల తరువాత ఆమె మళ్లీ తమ ఇంటికి రావడం ఆనందంగా ఉందని అన్నారు.

First published: June 20, 2020, 8:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading