లైంగిక నేరాల కేసుల్లో వేగవంతంగా విచారణ జరిపి తీర్పు వెలువరించేందుకు దేశంలోని క్రిమినల్ కోర్టులు ప్రయాసపడుతున్న వేళ, గుజరాత్‌లోని అహ్మదాబాద్ కోర్టులో 41 ఏళ్ల క్రితం జరిగిన అత్యాచార కేసు విచారణకు వచ్చింది. అయితే ఈ కేసులో నిందితుడిని నిర్దోషిగా విడుదల చేయాల్సి వచ్చింది. ఆరోపణలు వచ్చిన 41 సంవత్సరాల తర్వాత విచారణ ప్రారంభం కావడమే ఇందుకు కారణం. ఈ కేసులో బాధితురాలి వయసు ప్రస్తుతం 55 సంవత్సరాలు. ఈ కేసు విషయంలో తాను ముందుకు వెళ్లాలనుకోవడం లేదని ఆమె కోర్టుకు తెలిపింది. తనకు వివాహమైందని, ప్రస్తుతం తనకు ఎదిగిన పిల్లలు ఉన్నారని, ఈ పరిస్థితుల్లో తాను న్యాయపరమైన వివాదాలను కోరుకోవడం లేదని వెల్లడించింది.
బాధితురాలు ధర్మాసనానికి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసి, కేసును ముగించాలని కోరింది. ఈ విషయాన్ని అదనపు సెషన్స్ జడ్జి డి.ఎం.వ్యాస్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. తగిన సాక్ష్యాలు లేని కారణంగా నిందితుడిని విడిచిపెడుతున్నట్టు నవంబర్ 30న ప్రకటించిన తీర్పులో పేర్కొన్నారు.
1980 నాటి ఈ కేసులో చిత్రమైన విషయాలు ఉన్నాయి. ముంబయికి చెందిన ఒక ట్యాక్సీ డ్రైవర్, అహ్మదాబాద్‌లోని సర్కేజ్ ప్రాంతానికి చెందిన ఒక మహిళను తీసుకొని జూన్ 30, 1980న పారిపోయాడు. ముంబయికి పారిపోతున్న ఆ జంటతో పాటు మహిళకు చెందిన స్నేహితురాలు కూడా ప్రయాణం చేశారు. ఆ స్నేహితురాలు జులై 3న అహ్మదాబాద్‌కు తిరిగివచ్చారు. అనంతరం పారిపోయిన మహిళను జులై 8న పోలీసులు కనుగొన్నారు.
ఆ మహిళ తండ్రి సహ నలుగురు సాక్ష్యులు చెప్పిన సాక్ష్యం ప్రకారం ఆ ట్యాక్సీ డ్రైవర్, ఇద్దరు మహిళలను తీసుకెళ్లాడని కోర్టు భావించింది. ఆ మహిళను వాకేశ్వర్‌లోని ఆమె ఇంట్లో డ్రైవర్ ఉంచాడని మరో సాక్షి చెప్పాడు. కానీ ఆమెను నిందితుడు బంధించలేదని కోర్టు భావించింది. మరోవైపు జులై 1న ట్యాక్సీ డ్రైవర్ వివాహాన్ని తాను జరిపించానని మరో సాక్షి చెప్పాడు. అప్పటికి యువతి వయసు 20 సంవత్సరాలని చెప్పిందని, కానీ ఆ తరువాత పెళ్లి కుమార్తె కనిపించలేదని తెలిపాడు.
ఈ కేసులో కీలకంగా మారిన సర్కేజ్ ప్రాంతానికి చెందిన మహిళ సాక్ష్యం చెప్పేందుకు నిరాకరించింది. ప్రత్యక్ష, పరోక్ష సాక్ష్యం లేకపోవడం వల్ల సాక్షులు చెప్పిన మాటలకు విలువ లేకుండాపోయిందని కోర్టు అభిప్రాయపడింది. నిందితుడికి జులై 1న వివాహం జరిగిన విషయం రుజువైందని కోర్టు ప్రకటించింది. కానీ అతడు వివాహం చేసుకున్నది సర్కేజ్‌కు చెందిన మహిళనేనా అనే విషయం రుజువు కాలేదని తెలిపింది. సాక్ష్యాలను బట్టి నిర్బంధం, వివాహం లేదా అత్యాచారం జరిగిందని తెలిపేందుకు ఎటువంటి రుజువులు లేవని న్యాయస్థానం పేర్కొంది.
Karnataka : అత్యాచారం అనివార్యమైనప్పుడు దాన్ని ఎంజాయ్ చేయాలట.. మాజీ స్పీకర్..
అయితే తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు ఆరోపించింది. ట్యాక్సీ డ్రైవర్‌పై ఆమె ఆరోపణలు చేసింది. ఈ ఘటన జూన్ 30, 1980న జరిగినట్లు చెప్పింది. అత్యాచారం జరిగినప్పుడు బాధితురాలికి 16 ఏళ్లు. ఈ ఘటన జరిగి నేటికి 41 ఏళ్లు. అయినా ఆ మహిళకు ఇంతవరకు న్యాయం జరగలేదు. 55 ఏళ్ల మహిళ చివరకు కేసును మూసివేయాలని కోర్టును కోరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: High Court, Rape case