హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Affair: మరిదితో అక్రమ సంబంధం.. దాన్ని కప్పిపుచ్చేందుకు చెల్లిని ఇచ్చి వివాహం.. చివరికి షాకింగ్ ట్విస్ట్

Affair: మరిదితో అక్రమ సంబంధం.. దాన్ని కప్పిపుచ్చేందుకు చెల్లిని ఇచ్చి వివాహం.. చివరికి షాకింగ్ ట్విస్ట్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ మహిళ తన మరిది(భర్త తమ్ముడి)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ గుట్టు బయటికి పొక్కకుండా, తాము ఎప్పటికీ కలిసుండే విధంగా తన సొంత చెల్లెలినే ప్రియుడికి ఇచ్చి కట్టబెట్టింది. చివరికి ఏమైందంటే..

వివాహేతర సంబంధాలు చివరికి నేర సంఘటనలుగా మారుతోన్న వైనం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. అక్రమ సంబంధాల విషయంలో కొందరు మహిళలు ఎందాకైనా తెగిస్తుండటం, చివరికి కన్నపిల్లల్ని, సొంత కుటుంబీకులనూ బలి చేయడానికి పూనుకోవడం సాధారణంగా మారింది. తాజాగా వెలుగు చూసిన షాకింగ్ ఘటనలో ఓ మహిళ తన మరిది(భర్త తమ్ముడి)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ గుట్టు బయటికి పొక్కకుండా, తాము ఎప్పటికీ కలిసుండే విధంగా తన సొంత చెల్లెలినే ప్రియుడికి ఇచ్చి కట్టబెట్టింది. అక్కాచెల్లెలు ఒకే ఇంటి కోడళ్లయ్యారని పుట్టింటివాళ్లు మురిసిపోయారు. కానీ కాపురం చేసేందుకు అత్తింటికి వచ్చిన కొత్త పెళ్లికూతురుకు అక్కడ జరుగుతోన్న తంతు తొందర్లోనే అర్థమైంది..

గుజరాత్ లో అతిపెద్ద నగరమైన అహ్మదాబాద్ సబర్బన్ మణినగర్ లో అనూహ్య ఘటన ఒకటి రిపోర్ట్ అయింది. తాను పెళ్లి చేసుకున్న వ్యక్తితో ముందు నుంచే తన సోదరికి వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయాన్ని బావ(అక్క భర్తకు) చెప్పినా పరిస్థితి మారలేదని, ఇలాంటి విషయాలు బయటికి పొక్కితే కుటుంబం పరువు పోతుందని పెద్దలు హెచ్చరించారంటూ తన దుస్థితిని వెళ్లబోసుకుంది బాధిత మహిళ. అభయం హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించిన బాధితురాలు.. కౌన్సిలర్ల నుంచి సాయం కోరింది. దురాగతానికి ఏమాత్రం తక్కువకాని ఈ ఘటన వివరాలను అభయం కౌన్సిలర్లు వెల్లడించారు..

Hyderabad: ఎప్పుడూ చలాకీగా ఉండే లాయర్ శివాని ఎందుకిలా చేసింది? భర్త లొంగుబాటు..


మణినగర్ లో నివాసం ఉంటోన్న మహిళకు నాలుగేళ్ల కిందట పెళ్లయింది. భర్త ఉండగానే ఆమె మరిదితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొన్నేళ్లుగా వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగింది. అయితే ఆ వ్యక్తికి ఇంట్లో వాళ్లు పెళ్లి సంబందాలు చూడటం మొదలుపెట్టారు. మరిదికి వేరే అమ్మాయితో పెళ్లయితే తనను ఎక్కడ దూరం పెడతాడో అనే ఆలోచనలో ఆ మహిళ నీచానికి దిగింది. తన అక్రమ సంబంధం గుట్టును దాచిపెట్టడానికి సొంత చెల్లెలి జీవితాన్ని పణంగా పెట్టింది. తాను వివాహేతర సంబందం కొనసాగిస్తున్న ప్రియుడు(మరిది)తో చెల్లెలికి పెళ్లి జరిపించింది. పెద్దల సమక్షంలో వివాహం జరిగిన కొద్ది రోజులకే బాధితురాలికి విషయం తెలియవచ్చింది..

Business Idea: కనీసం రూ.5వేలతోనూ ప్రారంభించి నెలకు రూ.లక్షలు సంపాదించవచ్చిలా..


కాపురానికి అత్తింటికి వెళ్లిన బాధితురాలు.. తన భర్త, అక్కలు చనువుగా ఉండటం చూసి మొదట్లో లైట్ తీసుకుంది. కానీ రోజూ రాత్రి భర్త భార్యను ముట్టుకోకుండా వదిన దగ్గరికి వెళుతుండేవాడు. కొద్దిరోజుల్లోనే విషయం అర్థం చేసుకున్న బాధితురాలు.. జరుగుతోన్న తంతును బావగారికి వివరించింది. కానీ అతడు అశక్తుడిలా ఉండిపోయాడు. అక్క, భర్తల మధ్య సాగుతోన్న తంతును భరించలేకపోయిన ఆమె రెండు కుటుంబాల్లోని పెద్దల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లింది. కానీ వాళ్లు కూడా కుటుంబం పరువు పోతుందని, కామ్ గా ఉండమని బాదితురాలికి సలహా ఇచ్చినట్లు కౌన్సిలింగ్ లో వెల్లడైంది. ఈ ఘటనలో కుటుంబం మొత్తానికి కౌన్సిలింగ్ అవసరమని అభయం హెల్ప్ లైన్ ప్రతినిధులు అంటున్నారు.

First published:

Tags: Ahmedabad, Extramarital affairs, Gujarat

ఉత్తమ కథలు