సహజీవనం (Living Realationship ) పేరుతో మగాళ్లు మృగాళ్లుగా మారుతున్నారు.. పిల్లలున్న తల్లులతో సహజీవనం చేస్తూనే ఆమె పిల్లలపై కూడా కన్నెస్తున్నారు.. ఆ తర్వాత సమయం చూసి వారిని కాటేయడం అలవాటుగా మారిపోయింది. అయితే ఇలా తనతో సహాజీవనం చేస్తున్నవాడు తన కూతురుపై కన్నేయడం ఆ తల్లి జీర్జించుకోలేక పోయింది. దీంతో వాడిని నమ్మించి నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసింది. అయితే పోలీసుల దర్యాప్తులో మాత్రం ఆమె నేరం బయటపడిన సంఘటన హర్యానాలో చోటు చేసుకుంది.
పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన ఓ మహిళ ఫరీదాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. వారిద్దరూ పంజాబ్‌లో నివసిస్తున్నారు. మహిళ భర్త 2019లో క్యాన్సర్‌తో మరణించగా.. ఆ తర్వాత అతని స్థానంలో కంపెనీ ఆమెకు ఉద్యోగం వచ్చింది. పవన్ కూడా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం కాస్త.. ప్రేమగా మారింది. ఇద్దరూ రెండేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో మహిళ పెద్ద కుమార్తె (14) తన తల్లితో నివసించేందుకు పంజాబ్ నుంచి బల్లాబ్ఘర్కు వచ్చింది. ఈ క్రమంలో పవన్ బాలికపై కన్నేసి వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆ బాలిక జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య.. గొడవ జరిగింది.
ఈ క్రమంలో పవన్‌ను హత్య చేయాలని ప్లాన్ రచించింది. అక్టోబరు 16న పవన్‌ను కారులో ఢిల్లీ తీసుకెళ్లింది. అతడిని చంపెందుకు మహిళ 15 రోజుల క్రితం బల్లభ్‌గఢ్ నుంచి 2 లీటర్ల పెట్రోల్, నిద్రమాత్రలు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో నా కోసం ఏదైనా చేస్తావా..? అంటూ పవన్‌ను మహిళ రెచ్చగొట్టింది. అయితే.. నిద్ర మాత్రలు వేసుకోవాలని పవన్ కు చెప్పింది. దీంతో పవన్ మాత్రలు మింగి స్పృహతప్పి పడిపోయాడు. అనంతరం మహిళ పవన్‌ను మరోకారులో ఫరీదాబాద్‌కు తీసుకెళ్లింది. ఆతర్వాత సెక్టార్-75లోని నిర్మానుష్య ప్రాంతంలో పవన్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేసింది.
హర్యానాలోని ఫరీదాబాద్‌లో 12 రోజుల క్రితం పవన్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆ మృతదేహం నైజీరియన్ వ్యక్తిగా ముందు పోలీసులు అనుమానించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే.. విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. హత్యకు గురైన వ్యక్తి హర్యానా బల్లభ్‌గఢ్ వాసి అని పోలీసులు తెలిపారు. మృతుడిని పవన్‌గా గుర్తించారు. సహజీవం చేసిన మహిళను అరెస్టు చేసి విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Haryana, Murder