తండ్రి అంత్యక్రియలు ఆపి.. స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌ను నడిపించిన మహిళ...

పరేడ్‌లో పాల్గొన్న మహేశ్వరి (Image:Twitter)

ఓ మహిళ తన తండ్రి అంత్యక్రియలను పక్కన పెట్టి.. మొదటగా స్వాంతంత్ర్య దినోత్సవ పరేడ్‌ను ముందుండి నడిపించింది.

  • Share this:
    ఓ మహిళ తన తండ్రి అంత్యక్రియలను పక్కన పెట్టి.. మొదటగా స్వాంతంత్ర్య దినోత్సవ పరేడ్‌ను ముందుండి నడిపించింది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఈఘటన జరిగింది. ఎన్. మహేశ్వరి అనే మహిళ ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తుంది. ఆమె తండ్రి ఆగస్టు 14వ తేదీరాత్రి కన్నుమూశారు. కానీ, ఆగస్టు 15వ తేదీన తన జిల్లా కలెక్టర్ శిల్పా ప్రభాకర్ సతీష్, ఎస్పీ ఎన్.మణివణ్ణన్ ఎదుట స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌‌కు ఆమె నాయకత్వం వహించాల్సి ఉంది. ఓ వైపు తండ్రి మరణం, మరోవైపు స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్.. దేని వైపు మొగ్గాలో సందిగ్ధం. అలాంటి సమయంలో ఆమె పరేడ్ వైపు అడుగులు వేసింది. పరేడ్ మొత్తం పూర్తయిన తర్వాత తన తండ్రి అంత్యక్రియలకు హాజరైంది. వృత్తి పట్ల నిబద్ధత, దేశం మీద అమిత గౌరవం చూపిన అలాంటి పోలీస్ అధికారి ఉండడం గర్వంగా ఉందంటూ పోలీసు శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పరేడ్ జరుగుతున్న సమయంలో కూడా ఆమె ఎక్కడా తనలో ఉన్న బాధను బయటపడనివ్వలేదు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: