దిశా కేసు నిందితులపై ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లో కాలేజీ స్టూడెంట్స్, మహిళలు, యువత పెద్ద ఎత్తున నినాదాలు చేసి హర్షం వ్యక్తం చేశారు. దిశాను చంపిన నిందితులకు సరైన శిక్షపడిందని.. దిశకు న్యాయం జరిగిదంటూ సంబరాలు చేసుకుంటున్నారు. అటు ఘటనా స్థలంలోనూ పోలీస్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు స్థానికులు. సాహో.. సజ్జనార్ అంటూ తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
కాగా, దిశా హత్య కేసులో మొత్తం నలుగురు నిందితులను షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి వద్ద ఎన్కౌంటర్ చేసి ఎన్కౌంటర్ చేశారు. దిశను చటాన్ పల్లి సమీపంలో తగులబెట్టిన చోటుకు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు తమ తుపాకులను లాక్కునేందుకు ప్రయత్నించారు. తుపాకులను లాక్కోవడం సాధ్యం కాకపోవడంతో పారిపోయేందుకు ప్రయత్నించారని.. అందుకే కాల్పులు జరిపామని తెలిపారు. ఎన్కౌంటర్లో నిందితులు అరిఫ్, శివ, చెన్నకేశవులు, నవీన్ నలుగురూ చనిపోయారని వెల్లడించారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.