వింత శిశువు జననం... ఆశ్చర్యపోయిన డాక్టర్లు, తల్లిదండ్రులు...

ఎప్పుడో ఒకసారి ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఆ వింత శిశువు ఎలా ఉందో, ఎందుకు అలా ఉందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: June 29, 2020, 12:31 PM IST
వింత శిశువు జననం... ఆశ్చర్యపోయిన డాక్టర్లు, తల్లిదండ్రులు...
వింత శిశువు జననం... ఆశ్చర్యపోయిన డాక్టర్లు, తల్లిదండ్రులు... (File)
  • Share this:
అది మధ్యప్రదేశ్. 28 ఏళ్ల ఆ మహిళకు తన ఇంట్లోనే డెలివరీ అయ్యింది. పాప పుట్టింది. ఐతే... పుట్టగానే పాపను చూసి... డాక్టర్లు ఆశ్చర్యరపోయారు. ఎలా స్పందించాలో కూడా వాళ్లకు అర్థం కాలేదు. డాక్టర్లు, నర్సులూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఎవరిలోనూ ఆనందం లేదు. అప్పటిదాకా పురుటినొప్పులు భరించిన ఆ తల్లి... తన బిడ్డను చూసుకునేందుకు తపన పడింది. కానీ డాక్టర్లు ఆమెకు బిడ్డను చూపించలేదు. ఏమైంది డాక్టర్... అంతా బాగానే ఉందిగా అంటే... ఏం లేదు... మీకు పాప పుట్టింది.... అన్నారు. ఓసారి చూస్తాను డాక్టర్ అంది ఆమె. చూపిస్తా... చూపిస్తా అన్నట్లుగా డాక్టర్ తలూపారే తప్ప... నోటితో ఆ మాట చెప్పలేదు. పైగా ఆమెను ఓదార్చుతున్నట్లు ప్రవర్తన ఉండటంతో... ఆమెకు ఎక్కడో ఏదో తెలియని సంకోచం వెంటాడింది.

ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా వచ్చారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బిడ్డను వాళ్లకు చూపించారు. గుక్కపెట్టి ఏడుస్తున్న ఆ పసికందును చూడగానే అందరి ముఖాల్లోనూ విచారం. ఏంటిది డాక్టర్... పాపను కాళ్లు, చేతులూ లేవు. అని తండ్రి అనగానే... తల్లి నోట మాట లేదు. ఏమన్నారూ... ఏమన్నారూ... అంటూ ఆమె కళ్ల వెంట కన్నీళ్లు ధారలా వచ్చేశాయి. పాపను ఆమెకు చూపిస్తే... పొత్తిళ్లలోకి తీసుకొని... బోరున ఏడ్చేసింది.

ఇలా కొంతసేపు గడిచాక... ఆ దంపతులకు ధైర్యం చెప్పిన డాక్టర్... కారణమేంటో వివరించారు. ఇదో అరుదైన జన్యుపరమైన సమస్య అని చెప్పారు. సైన్స్ పరంగా చెప్పాలంటే... ఆటోసోమల్ రిసెస్సివ్ కంజెనిటల్ డిజార్టర్. సింపుల్‌గా దీన్ని టెట్రా-అమెలియా అని పిలుస్తున్నారు. ఇది ఉన్న పిల్లలు చేతులు, కాళ్లు లేకుండా పుడతారు.

ప్రస్తుతం ఆ చిన్నారి పూర్తి ఆరోగ్యంగా ఉంది. చేతులు, కాళ్లు లేవు కాబట్టి... మరిన్ని టెస్టులు చేస్తామని డాక్టర్లు తెలిపారు. ఐతే... టెస్టులు చెయ్యించడానికి పాప పేరెంట్స్ సిద్ధంగా లేరు. ఎలా ఉన్నా ఆ పాపను జాగ్రత్తగా పెంచుకుంటామని అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు మాత్రం చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు.

వింత శిశువు జననం... ఆశ్చర్యపోయిన డాక్టర్లు, తల్లిదండ్రులు... (credit - twitter)


లక్ష మంది పసికందుల్లో ఒకరు ఇలా పుడుతుంటారని డాక్టర్లు తెలిపారు. 2011లో దీనిపై స్పెయిన్‌లో ఓ అధ్యయనం చేశారు. దాని ప్రకారం ప్రతి 71 వేల మందిలో ఒకరు ఇలా పుడుతున్నారట. ఆస్ట్రేలియాలో నిక్ ఇలాగే పుట్టాడు. కష్టపడి పెరిగి... మోటివేషనల్ స్పీకర్ అయ్యాడు. ప్రపంచంలో కీనోట్ స్పీకర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు.
First published: June 29, 2020, 12:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading