WOMAN GIVES BIRTH IN AMBULANCE AS ELEPHANT BLOCKS ROAD IN TAMIL NADU PVN
Elephant : అంబులెన్స్‌కు అడ్డంగా ఏనుగు..లోపల గర్భిణీకి నొప్పులు..చివరికి అలా
ప్రతీకాత్మక చిత్రం
Elephant Blocks Road : అటవీ ప్రాంతానికి చెందిన నిండు గర్భవతి అయిన 24 ఏళ్ల గిరిజన మహిళకు గురువారం పురుటి నొప్పులు వచ్చాయి. ప్రసవవేదన ఎక్కువవుతుండడంతో హాస్పిటల్ కు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్స్ ఎక్కించారు. కానీ అంబులెన్స్ కొద్దిదూరం వెళ్లాక మార్గమధ్యంలోనే ఆపివేయాల్సి వచ్చింది.
Elephant Blocks Road : అటవీ ప్రాంతానికి చెందిన నిండు గర్భవతి అయిన 24 ఏళ్ల గిరిజన మహిళకు గురువారం పురుటి నొప్పులు వచ్చాయి. ప్రసవవేదన ఎక్కువవుతుండడంతో హాస్పిటల్ కు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్స్ ఎక్కించారు. కానీ అంబులెన్స్ కొద్దిదూరం వెళ్లాక మార్గమధ్యంలోనే ఆపివేయాల్సి వచ్చింది. అడవిలోంచి వచ్చిన ఓ ఏనుగు ఘాట్ రోడ్డుకు అడ్డంగా నిలబడింది. రోడ్డుకు అడ్డంగా ఏనుగు ఉండటంతో అంబులెన్స్ నిలిచిపోయింది. ఎంత ప్రయత్నించినా పక్కకి తొలగలేదు.
అరగంట అయినప్పటికీ ఏనుగు అక్కడి నుంచి కదలలేదు. మరోవైపు అంబులెన్స్ లో ఉన్న గర్భిణీ(Pregnant Woman)కి పురుటి నొప్పులు ఎక్కువయ్యాయి. నొప్పులు మరింత పెరుగుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎంతసేపు వేచిచూసినా ఏనుగు రోడ్డు దిగలేదు. ఆఖరికి నొప్పులు భరించలేక అంబులెన్స్‌లోనే మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అంబులెన్స్(Ambulence)లోని వైద్య సిబ్బంది ఆమె ప్రసవానికి సహకరించారు. ఈ ఘటన తమిళనాడు(Tamilnadu)లోని ఎరోడె జిల్లాలో గురువారం జరిగింది. ప్రసవం జరిగిన కొన్ని నిమిషాల తర్వాత రోడ్డు మీద నుంచి ఆ ఏనుగు కదిలింది. రోడ్డును వదలి అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో మహిళతోపాటు పసి బిడ్డను అంబులెన్స్ లో స్థానిక గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.