ఈమెకు కులమతాలు లేవు... దేశంలోనే తొలి సర్టిఫికెట్ జారీ

కులమతాలు లేవంటూ సర్టిఫికెట్ అందుకున్న స్నేహ

కులాలు, మతాలు మనుషుల్ని విడగొట్టడమే కాదు... గొడవలు, హింస చెలరేగేందుకు కూడా కారణం అవుతున్నాయి. వాటిని ఖండించే లక్ష్యంతో స్నేహ తొలిసారిగా దేశంలో కులం, మతం లేని మహిళగా గుర్తింపు తెచ్చుకుంది.

  • Share this:
కులం మతం లేని మహిళగా తమిళనాడు ప్రభుత్వం నుంచీ సర్టిఫికెట్ పొందారు స్నేహ. వేలూరు జిల్లా... తిరుషత్తూరుకి చెందిన ఆనందకృష్ణన్, మణిమొళి దంపతుల కూతురు స్నేహ. ఆమె చిన్నప్పటి నుంచీ చదివిన స్కూళ్లలోని సర్టిఫికెట్లలో ఎక్కడా కులం, మతాలను రాయలేదు. గతేడాది ఆమెకు పార్థివ్ రాజతో పెళ్లైంది. అప్పటికే ఆమె తాను ఏ కులానికీ, మతానికీ చెందిన దాన్ని కాదంటూ... సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా ఆమె ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎట్టకేలకు దాన్ని పరిశీలించిన ప్రభుత్వం మంజూరు చేసింది. తాజాగా తిరుపత్తూరు తహశీల్దారు సత్యమూర్తి... స్నేహకు కులమతాలు లేని మహిళగా గుర్తిస్తూ సర్టిఫికెట్ ఇచ్చారు. ఫలితంగా దేశంలో అలాంటి సర్టిఫికెట్ పొందిన తొలి మహిళగా స్నేహ గుర్తింపు పొందారు.

no caste no religion, sneha, unique woman, special certificate, tamilnadu news, tamilnadu updates, tamilnadu politics, తమిళనాడు ప్రభుత్వం, కులం మతం లేని మహిళ, తమిళనాడు రాజకీయాలు
కులమతాలు లేవంటూ సర్టిఫికెట్ అందుకున్న స్నేహ

అసలు ఇలాంటి సర్టిఫికెట్ ఒకటి ఉంటుందని చాలా మందికి తెలియదు. 35 ఏళ్ల స్నేహ స్వతహాగా లాయర్. అందువల్ల ఆమెకు ఈ సర్టిఫికెట్ల విషయాలన్నీ బాగా తెలుసు. ఆమె తల్లిదండ్రులు కూడా లాయర్లే. అందువల్ల ఆమెను కులాలు, మతాలకు దూరంగా పెంచారు. రాజ్యాంగం ప్రకారం స్కూళ్లలో విద్యార్థుల కులం, మతం లను నమోదు చెయ్యకూడదు. కానీ చాలా స్కూళ్లలో నమోదు చేస్తున్నారు.

no caste no religion, sneha, unique woman, special certificate, tamilnadu news, tamilnadu updates, tamilnadu politics, తమిళనాడు ప్రభుత్వం, కులం మతం లేని మహిళ, తమిళనాడు రాజకీయాలు
కులమతాలు లేవంటూ సర్టిఫికెట్ అందుకున్న స్నేహ

కులం మతం లేదనే సర్టిఫికెట్ కూడా ఉన్నపళంగా వచ్చేయలేదు. ఇందుకోసం ఆమె ఫ్యామిలీ 9 ఏళ్లపాటూ పోరాడాల్సి వచ్చింది.

no caste no religion, sneha, unique woman, special certificate, tamilnadu news, tamilnadu updates, tamilnadu politics, తమిళనాడు ప్రభుత్వం, కులం మతం లేని మహిళ, తమిళనాడు రాజకీయాలు
కులమతాలు లేవంటూ సర్టిఫికెట్ అందుకున్న స్నేహ

రాజ్యాంగం ప్రకారం ఓ వ్యక్తికి కులం, మతం లేదని నిర్ధారించే హక్కు తహసిల్దారుకు ఉంటుంది. వాళ్లు వ్యక్తిగత వివరాలన్నీ తెలుసుకొని... వాటి ప్రకారం ఆ సర్టిఫికెట్ ఇస్తారు. స్నేహ విషయంలోనూ అదే జరిగింది. మొత్తానికి ఆమె ప్రత్యేక మహిళగా నిలిచింది.

Video : తూర్పు గోదావరి జిల్లాలో చిరుత పులి... ముగ్గురిపై దాడి చేసి చెట్టెక్కింది
First published: