Woman Find Diamond : డైమండ్స్(Diamonds)కు పేరుగాంచిన మధ్యప్రదేశ్(Madhyapradesh)లోని పన్నా జిల్లాలో ఓ మహిళను అదృష్టం వరించింది. భూమిని నమ్ముకొని బతుకుతున్న మహిళ లీజ్ తీసుకున్న గనిలో వజ్రం దొరికింది. ఈ ఏడాది మార్చిలో మైన్ లీజుకు తీసుకోగా.. తాజాగా 2.08 క్యారెట్ల వజ్రం బయటపడింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లాలోని ఇత్వాకలా గ్రామంలో నివసించే చమేలి భాయి.. కృష్ణ కల్యాణ్‌పుర్ పాటి ప్రాంతంలో వజ్రాల గనిని లీజుకు తీసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో లీజుకు తీసుకొని మైనింగ్ ప్రారంభించారు. లీజుకు తీసుకున్న గనిలో మంగళవారం 2.08 క్యారెట్ల వజ్రం దొరికింది. దీంతో చమేలి భాయి దంపతుల ఆనందానికి అవధుల్లేవ్. ఈ వజ్రంతో మా కష్టాలు తీరిపోతాతున్నాయ్ అంటూ సంబరపడ్డారు. ఈ వజ్రాన్ని చసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు.
ALSO READ Shocking : ఒక స్కూటర్ పై ఆరుగురు ప్రయాణం..వీడియో వైరల్
ఇక మంగళవారం పన్నా డైమండ్ ఆఫీస్‌లో ఈ వజ్రాన్ని అధికారుల వద్ద డిపాజిట్ చేశారు చమేలి దంపతులు. దీనికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధర నిర్ణయించి త్వరలో వేలం వేస్తారు. వజ్రం నాణ్యతను బట్టి దీనికి రూ.10 లక్షల వరకు పలకొచ్చని అధికారులు తెలిపారు. వేలంలో వచ్చిన ధర నుంచి పన్నులు, రాయల్టీలను మినహాయించి మిగిలిన మొత్తాన్ని మహిళకు అప్పగిస్తామని చెప్పారు. చమేలి భర్త అర్వింద్ సింగ్ మాట్లాడుతూ.."అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వజ్రాల గనిని లీజుకు తీసుకున్నాం. వజ్రం దొరకడం సంతోషంగా ఉంది. వజ్రాన్ని వేలం వేసిన తర్వాత వచ్చిన సొమ్ముతో పన్నా నగరంలో ఇల్లు కొనుక్కుంటాం"అని చెప్పారు. కాగా,పన్నా జిల్లాలోని గనుల్లో 12 లక్షల క్యారెట్ల వజ్రాలు ఉన్నట్లు అధికారుల అంచనా.
ALSO READ Leopard burnt alive : బోనులో చిక్కిన చిరుత..పెట్రోల్ పోసి తగులబెట్టిన గ్రామస్తులు
కాగా, ఇటీవలే పన్నా జిల్లాలోనే..భూమిని నమ్ముకొని బతుకుతున్న ఓ చిన్న రైతు లీజ్ తీసుకున్న గనిలో వజ్రం దొరికింది. ప్రతాప్ సింగ్ యాదవ్ అనే రైతు తన గనిలో మూడు నెలలుగా ఎంతో శ్రమించి పనిచేయగా… 11.88 క్యారెట్ల వజ్రం దొరికినట్లు వజ్రాల కార్యాలయం అధికారి రవి పటేల్ వెల్లడించారు. ఇది ఎంతో నాణ్యతతో కూడినదని చెప్పారు. ఈ సందర్భంగా రైతు యాదవ్ మాట్లాడుతూ…"నేను చాలా పేద రైతును.. కొద్దిపాటి వ్యవసాయ భూమి ఉంది. కూలీగా పని చేసుకుంటున్నాను . గత మూడు నెలలుగా ఈ గనిలో ఎంతో శ్రమించాను. నాకు దొరికిన డైమండ్ వజ్రాల కార్యాలయంలో అప్పగించాను"అని అన్నారు. డైమండ్ వేలంలో తనకు వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం పెట్టుకుంటానని, తన పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తానని ఆ రైతు చెప్పుకొచ్చాడు. ఈ డైమండ్ ధర సుమారు రూ. 50 లక్షలు ఉంటదని సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Diamonds, Madhya pradesh, WOMAN