Home /News /national /

ఇష్టంగా sexలో పాల్గొన్నా, గర్భంపై హక్కు మాత్రం మహిళదే -కోర్టు తీర్పు -ఫేస్‌బుక్ ద్వారా పరిచయం.. 4సార్లు అబార్షన్

ఇష్టంగా sexలో పాల్గొన్నా, గర్భంపై హక్కు మాత్రం మహిళదే -కోర్టు తీర్పు -ఫేస్‌బుక్ ద్వారా పరిచయం.. 4సార్లు అబార్షన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పరస్పర అంగీకారంతో సెక్స్ కు సమ్మతి తెలిపినంత మాత్రాన ఒక మహిళకు సంబంధించిన పునరుత్పత్తి హక్కుల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని, గర్భం దాల్చే విషయంలో నిర్ణయాధికారం ఆమెది మాత్రమే అవుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది..

ఎవరైనా మహిళ సమ్మతితో సెక్స్ లో పాల్గొని, పురుషుడితో లైంగిక చర్యలో స్వయంప్రతిపత్తిని అనుభవించే హక్కు కాదనలేనిదని, అయితే, సెక్స్ కు అంగీకరించినంత మాత్రాన ఆమె గర్భం దాల్చాలా? వద్దా? అనేది పురుషుడి నిర్ణయాధికారం కాబోదని, పునరుత్పత్తి వ్యవస్థపై పూర్తి హక్కులు మహిళకు మాత్రమే చెందుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. బలవంతపు అబార్షన్లు, లైంగిక దాడికి సంబంధించిన ఓ కేసులో ఢిల్లీ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశమైంది..

ఒక మహిళ సమ్మతి ద్వారా లైంగిక చర్యలో పాల్గొన్నప్పటికీ ఆమె పునరుత్పత్తి హక్కులను నిరాకరించడానికి వీల్లేదని, గర్భాన్ని ఉంచుకోవాలా? వద్దా? అనేది నూరు శాతం ఆమె నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందే తప్ప పురుషుడి బలవంతానికి తావు ఉండరాదని ఢిల్లీ సెషన్స్ కోర్టు జడ్జి విశాల్ గోగ్నే అన్నారు. ఫేస్ బుక్ ద్వారా పరిచయమై, కొన్నాళ్లు లైంగిక బంధాన్ని కొనసాగించిన ఓ జంట తాలూకు కేసును విచారించిన సందర్భంగా ఆయనీ తీర్పు చెప్పారు.

స్త్రీ, పురుషులు ఏకాభిప్రాయంతో లైంగిక సంబంధాలను స్థిరంగా లేదా సుదీర్ఘకాలంగా కొనసాగించిన సందర్భంలో కూడా మహిళ గర్భధారణ లేదా పునరుత్పత్తి స్వయంప్రతిపత్తి హక్కులు మారబోవని, ఇష్టంతో సెక్స్ లో పాల్గొన్నంత మాత్రాన ఆమె కడుపుపై నియంత్రణ కుదరబోదని కోర్టు క్లారిటీ ఇచ్చింది. ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ కేసు వివరాల్లోకి వెళితే..

బాధిత మహిళ, నిందితుడు గతంలో ప్రేమికులు. ఫేస్ బుక్ ద్వారా ఏర్పడిన పరిచయంతో ఒక్కటైన వాళ్లు.. చాలా కాలంపాటు లైంగిక సంబంధాన్ని కొనసాగించారు. అయితే తనపై జరిగింది అత్యాచారమని, కడుపు వచ్చిన ప్రతిసారి అతను బలవంతంగా అబార్షన్లు చేయించాడని, ఇప్పటికి నాలుగు సార్లు తాను గర్భవిచ్ఛితికి పాల్పడాల్సి వచ్చిందని బాధిత మహిళ ఆరోపించింది. అయితే, నిందితుడు మాత్రం రేప్ వాదనను ఖండించాడు. ఆమె ఇష్టంతోనే తనతో సెక్స్ కు ఒప్పుకుందని కోర్టుకు తెలిపాడు. కానీ అబార్షన్ల విషయంలో మాత్రం అతను అడ్డంగా దొరికిపోయాడు..

ఇష్టంతో సెక్స్ కు ఒప్పుకున్నంత మాత్రాన మహిళ గర్భంపై పురుషుడికి హక్కు ఉండదన్న కోర్టు.. ఆ క్లాజు కింద నిందితుడికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ‘ఒక వ్యక్తి/స్త్రీ శారీరక/లైంగిక స్వయంప్రతిపత్తి భావన లోపభూయిష్ట నిర్మాణం. మహిళల లైంగిక ఎంపికలు ఆమెను లైంగికంగా దోపిడీ చేసే భాగస్వామికి ఎలాంటి హక్కును ఇవ్వదు. భాగస్వామితో లైంగిక సంబంధం పెట్టుకున్నప్పుడు స్త్రీ పునరుత్పత్తి హక్కులతో సహా తన ఇతర హక్కులను వదులుకోదు’అని జడ్జి విశాల్ కుండబద్దలు కొట్టారు. అంతేకాదు.. ఒక యువతి ఒంటరి తల్లిగా ముద్రపడినా గర్భాన్ని మోస్తానని ముందుకు రావడం నిజంగా చాలా కష్టమైన నిర్ణయమని, అది కూడా ఆ బిడ్డకు తండ్రి అత్యాచారం చేసినవాడు అయినప్పుడు సదరు నిర్ణయం కఠినమైనదనీ జడ్జి వ్యాఖ్యానించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Attempting abortion, Delhi

తదుపరి వార్తలు