HOME »NEWS »NATIONAL »within 4 months a sky high temple of lord ram will be built in ayodhya says amit shah sk

అయోధ్య రామ మందిరంపై కేంద్రం కీలక ప్రకటన

అయోధ్య రామ మందిరంపై కేంద్రం కీలక ప్రకటన
అయోధ్య రామమందిరం నమూనా (Image: Reuters)

సోమవారం ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో రామ మందిరంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు.

  • Share this:
    దశాబ్ధాల నాటి అయోధ్య రామజన్మభూమి వివాదానికి నవంబరులో సుప్రీంకోర్టు పరిష్కారం చూపించిన విషయం తెలిపిందే. ఐతే చారిత్రాత్మక తీర్పు వచ్చిన తర్వాత అందరిలోనూ ఒకటే ప్రశ్న ఉత్పన్నమైంది. అదే.. రామ మందిర నిర్మాణం ఎప్పుడు? ఎప్పటి లోగా అయోధ్య రాముడి గుడి కడతారు? సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇప్పటి వరకు కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. ఐతే ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో రామ మందిరంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు.

    4 నెలల్లో అయోధ్యలో ఆకాశమంత ఎత్తులో రామ మందిరాన్ని నిర్మిస్తామని అమిత్ షా ప్రకటించారు. సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించిందని.. త్వరలోనే అయోధ్య రాముడు భక్తులకు దర్శనమిస్తాడని తెలిపారు. ఝార్ఖండ్‌లోని పాకూర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.



    కాగా, అయోధ్య కేసులో నవంబరు 9న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమి రామజన్మభూమి న్యాస్‌కే చెందుతుందని వెల్లడించింది. మసీదుకు అయోధ్యలోనే 5 ఎకరాల ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలని కేంద్రానికి సూచించింది కోర్టు. సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ నేత్రుత్వంలోని జస్టిస్ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ ఏకగ్రీవ తీర్పును వెల్లడించింది. ఇక అయోధ్య తీర్పుపై దాఖలైన మొత్తం 18 రివ్యూ పిటిషన్లను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసింది. తీర్పును పున:సమీక్షించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

    Published by:Shiva Kumar Addula
    First published:December 16, 2019, 14:55 IST

    टॉप स्टोरीज