రెండోసారి మోదీ ప్రమాణస్వీకారం... ప్రత్యేకతలు ఇవీ...

PM Narendra Modi : రికార్డు స్థాయిలో ఈసారి మోదీ ప్రమాణస్వీకారానికి 6,500 మంది అతిథులు వస్తున్నారు. వారిలో ప్రత్యేక అతిథులుగా బిమ్‌స్టెక్ అధినేతలు ఉండబోతున్నారు. క్రీడాకారులైన రాహుల్ ద్రవిడ్, సైనా నెహ్వాల్, నటులు రజనీకాంత్, షారుక్ ఖాన్, వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతం అదానీ, రతన్ టాటా తదితరులు వస్తున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 30, 2019, 6:00 AM IST
రెండోసారి మోదీ ప్రమాణస్వీకారం... ప్రత్యేకతలు ఇవీ...
ప్రధాని నరేంద్ర మోదీ
  • Share this:
PM Narendra Modi Oath : భారీ మెజార్టీతో రెండోసారి బీజేపీని అధికారంలోకి తెచ్చిన నరేంద్ర మోదీ... రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సాయంత్రం 7గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. 68 ఏళ్ల మోదీ చేత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్‌... ఫోర్ కోర్టు (ముందున్న భారీ ప్రాంగణం)లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన ద్వారం నుంచీ ప్రధాన భవనంలోకి దారి తీసేలా T ఆకారంలో ఫోర్ కోర్టు ఉంటుంది. దేశ రాజకీయ చరిత్రలో ఓ ప్రధాని రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్‌లో కాకుండా ఫోర్ కోర్టులో ప్రమాణ స్వీకారం చేయబోవడం ఇది ఆరోసారి. మోదీతోపాటూ ఎంత మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారన్నది ఢిల్లీ వర్గాలు స్పష్టత ఇవ్వట్లేదు. ఆర్థిక మంత్రిగా చేసిన అరుణ్ జైట్లీ మాత్రం అనారోగ్య కారణాలతో మరోసారి బాధ్యతలు నిర్వహించలేనని మోదీకి లేఖ రాశారు.

మోదీ ప్రమాణం చేయబోయే ప్రాంగణం (ఫోర్ కోర్టు) ఇదే. (Image : Twitter / manishgarg


ఈ వేడుకకు 6500 మందికిపైగా అతిథులు వస్తున్నారు. దర్బార్ హాల్‌లో 500 మందికి మాత్రమే చోటు ఉంటుంది. అందుకే పెద్దదైన ఫోర్ కోర్టును ఎంచుకున్నారు. 2014లో కూడా మోదీ అక్కడే ప్రమాణం చేశారు. ఇక ఈ ప్రమాణస్వీకారానిక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు వెళ్లబోతున్నారు. ప్రతిపక్షాల నుంచీ టీఆర్ఎస్ తరపున తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ తరపున ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఢిల్లీ సీఎం అరవింద కేజ్రీవాల్, జేడీఎస్ తరపున కర్ణాటక సీఎం కుమారస్వామి హాజరు కాబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్, జగన్‌తో కలిసి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.

ఈ కార్యక్రమానికి బిమ్‌స్టెక్ దేశాధినేతలు హాజరుకానున్నారు. 2014లో మోదీ ప్రమాణస్వీకారం చేసినప్పుడు సార్క్ దేశాధినేతల్ని ఆహ్వానించారు. ఈసారి మాత్రం BIMSTEC దేశాధినేతలకు ఆహ్వానం పంపారు. BIMSTEC అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటీవ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కార్పొరేషన్. బంగాళాఖాతం తీరంగా ఉన్న దేశాలు మాత్రమే బిమ్‌స్టెక్ గ్రూప్‌లో ఉన్నాయి. భారతదేశంతో పాటు బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలు బిమ్‌స్టెక్ గ్రూప్‌లో ఉన్నాయి. మారిషస్, కిర్గిజ్ రిపబ్లిక్ దేశాధినేతలకు కూడా భారత్ ఆహ్వానం పంపింది.

ఈ కార్యక్రమాన్ని 10వేల మంది భద్రతా సిబ్బంది పర్యవేక్షించబోతున్నారు. ఢిల్లీ పోలీసులు, కేంద్ర పారామిలిటరీ దళాలు భద్రతా చర్యలు చేపడుతున్నాయి. కీలక ప్రదేశాల్లో క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా రెడీగా ఉన్నాయి. మోదీ, విదేశీ అతిథుల భద్రత కోసం 2వేల మందితో సెక్యూరిటీ కల్పించబోతున్నారు. ఢిల్లీ పరిసరాల్లో మధ్యాహ్నం 2 తర్వాత కొన్ని రూట్లను మూసివేయనున్నారు.
First published: May 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading