• HOME
 • »
 • NEWS
 • »
 • NATIONAL
 • »
 • WITH THE CONVERSION OF AROUND 2500 COACHES 40000 ISOLATION BEDS ARE NOW READY FOR USE SK

రైళ్లే కరోనా ఆస్పత్రులు... ఏకంగా 40వేల ఐసోలేషన్ బెడ్స్ సిద్ధం

రైళ్లే కరోనా ఆస్పత్రులు... ఏకంగా 40వేల ఐసోలేషన్ బెడ్స్ సిద్ధం

రైలు బోగీలో ఐసోలేషన్ బెడ్

ఇప్పటి వరకు 2500 రైల్వే కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ఆ కోచ్‌లలో దాదాపు 40వేల ఐసోలేషన్ బెడ్స్ సిద్ధం చేసినట్లు తెలిపింది.

 • Share this:
  దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారికి కరోనా సోకడంతో పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలన్నీ అప్రమత్తమై కోవిడ్-19 ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్ కేంద్రాల సంఖ్యను పెంచుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కేసుల సంఖ్య ఎంత వరకు వెళ్తుందో తెలియదు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే కోవిడ్-19పై పోరాటంలో రైల్వేశాఖను కూడా భాగస్వామ్యం చేసింది కేంద్రం. ఏకంగా రైళ్లనే కరోనా ఆస్పత్రులుగా మార్చేసింది.

  కరోనా బాధితులకు చికిత్స అందజేసేందుకు రైల్వే కోచ్‌లు ఐసోలేషన్ వార్డులుగా మార్చుతోంది రైల్వేశాఖ. ఇప్పటి వరకు 2500 రైల్వే కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ఆ కోచ్‌లలో దాదాపు 40వేల ఐసోలేషన్ బెడ్స్ సిద్ధం చేసినట్లు తెలిపింది. రోజుకు సగటున 375 కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చుతున్నట్లు పేర్కొంది. ఆస్పత్రుల్లో ఉండే అన్ని వైద్య సదుపాయాలు వీటిలో ఉంటాయని అధికారులు తెలిపారు. ఆ రైళ్లను దేశవ్యాప్తంగా ఆయా రైల్వే మండళ్లకు చేరవేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు రైల్వేమంత్రి పీయుష్ గోయెల్ ట్వీట్ చేశారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు