అప్పటికే పాక్‌పై పంజా విసిరేందుకు సిద్ధంగా ఉన్నాం.. ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

పాక్ ఆర్మీ ఏ చర్యలకు పాల్పడినా సమర్థవంతంగా తిప్పి కొట్టడమే కాదు.. ఆ దేశ భూభాగంలోకి చొచ్చుకెళ్లి వారి భరతం పడతామని, దాని కోసం ఆర్మీ అన్ని విధాలా సిద్ధంగా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 20, 2019, 10:24 AM IST
అప్పటికే పాక్‌పై పంజా విసిరేందుకు సిద్ధంగా ఉన్నాం.. ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ (ఫైల్ ఫొటో)
  • Share this:
పాకిస్తాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడితే.. ఆ దేశంలోకి చొచ్చుకెళ్లి మరీ యుద్ధం చేయగలమని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. పాక్ ఆర్మీ ఏ చర్యలకు పాల్పడినా సమర్థవంతంగా తిప్పి కొట్టడమే కాదు.. ఆ దేశ భూభాగంలోకి చొచ్చుకెళ్లి వారి భరతం పడతామని, దాని కోసం ఆర్మీ అన్ని విధాలా సిద్ధంగా ఉందని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలియజేశారు. పదవీ విరమణ చేసిన సైనికాధికారులతో రావత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. పుల్వామా దాడి తర్వాత పాక్‌కు సరైన బుద్ధి చెప్పేందుకు తాము రెడీ అయ్యాం. స్వల్పకాలిక, తీవ్రస్థాయి యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. బాలాకోట్ వైమానిక దాడులు కాకుండా, ఆర్మీ సైనికులకు ఆ బాధ్యత అప్పజెప్పినా ఆ దేశ భూభాగంలోకి చొచ్చుకెళ్లి వారి భరతం పట్టేవాళ్లం’ అని తెలిపారు. బాలాకోట్ దాడుల తర్వాత పాక్ ఏదైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే సమర్థవంతంగా తిప్పికొట్టగలమా? అని కేంద్ర ప్రభుత్వం అడిగిందని.. ఏ పరిస్థితుల్లోనైనా సరే, వీలైతే ఆ దేశంలోకి చొచ్చుకెళ్లి దాడి చేయగల సామర్థ్యం మన ఆర్మీకి ఉందని రావత్ ప్రభుత్వ పెద్దలకు చెప్పినట్లు సమాచారం.

పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ సైనికాధికారి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉరి ఉగ్ర దాడుల్లో సైనికుల మరణాలకు ప్రధాన కారణం.. సరైన ఆయుధాలు లేకపోవడమే అని గుర్తించాం. దానిపై సమీక్షలు జరిపి ఆయుధాల కొనుగోళ్లు ప్రారంభించాం. ప్రస్తుతం రూ.11వేల కోట్ల విలువైన ఆయుధాలను కొనుగోలు చేశామని, అందులో 95 శాతం సైన్యానికి చేరాయని తెలిపారు. రూ.7వేల కోట్ల విలువైన ఆయుధాల కొనుగోళ్లు ఫైనలైజ్ అయ్యాయని, మరో రూ9.వేల కోట్ల ఆయుధాల కొనుగోళ్లపై చర్చలు పూర్తయ్యే దశలో ఉన్నాయని వివరించారు.

First published: August 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు