నేడు అభినందన్ వర్ధమాన్‌కు వీరచక్ర పురస్కారం

Abhinandan Varthaman to get Vir Chakra : పాక్ సైనికులు ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ.. దేశ రహస్యాలను అభినందన్ బయటపెట్టలేదు. ఆ సమయంలో అభినందన్ చూపించిన తెగువ, ఆత్మస్థైర్యం ప్రతీ భారతీయుడిని కదిలించింది.

news18-telugu
Updated: August 15, 2019, 5:48 AM IST
నేడు అభినందన్ వర్ధమాన్‌కు వీరచక్ర పురస్కారం
అభినందన్ వర్తమాన్ (File Photo)
  • Share this:
భారత 73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు ప్రభుత్వం వీరచక్ర పురస్కారాన్నిఅందజేయనుంది. ఐఏఎఫ్‌ సిఫారసులతో కేంద్రం అభినందన్‌కు వీరచక్ర పురస్కారానికి ఎంపిక చేసింది. పుల్వామా ఘటన తర్వాత భారత గగనతలంలోకి ప్రవేశించిన పాక్ యుద్ద విమానాలను వెంటాడే క్రమంలో అభినందన్ పాక్ ఆర్మీకి చిక్కిన సంగతి తెలిసిందే. పాక్ సైనికులు ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ.. దేశ రహస్యాలను అభినందన్ బయటపెట్టలేదు. ఆ సమయంలో అభినందన్ చూపించిన తెగువ,ఆత్మస్థైర్యం ప్రతీ భారతీయుడిని కదిలించింది. ఈ నేపథ్యంలోనే అభినందన్‌ను వీరచక్ర పురస్కారానికి ఎంపిక చేశారు. ఇటీవలే అన్ని మెడికల్ టెస్టులు పూర్తి చేసుకున్న అభినందన్.. త్వరలోనే విధుల్లో చేరబోతున్నట్టు సమాచారం. పాకిస్తాన్‌ ఆర్మీకి చిక్కిన సందర్భంలో గాయపడిన నేపథ్యంలో అభినందన్ విధులకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో కశ్మీర్‌లోని పుల్వామాలో భారత మిలటరీపై పాకిస్తాన్‌కి చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడుల్లో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ పాక్‌లోని బాలాకోట్ ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఇదే క్రమంలో పాక్ యుద్ద విమానాలు భారత్‌లోకి చొరబడేందుకు యత్నించగా.. భారత్ వైమానిక దళం వాటిని తిప్పికొట్టింది. ఈ క్రమంలో పాక్ వయుద్ద విమానం Mig-21ని భారత్ కూల్చివేయగా.. అభినందన్ వర్తమాన్ పాక్ ఆర్మీకి చిక్కాడు. ఎట్టకేలకు పాక్ ఆర్మీ అభినందన్‌ను ఇండియాకు అప్పగించడంతో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి.

First published: August 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు