వింగ్ కమాండర్ అభినందన్ మీసకట్టుపై లోక్‌సభలో ఆసక్తికర చర్చ

అభినందన్‌ మీసకట్టుకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఎంతో మంది యువకులు ఆయన మీసాల స్టైల్‌ను ఫాలో అయ్యారు.

news18-telugu
Updated: June 24, 2019, 4:01 PM IST
వింగ్ కమాండర్ అభినందన్ మీసకట్టుపై లోక్‌సభలో ఆసక్తికర చర్చ
అభినందన్ వర్తమాన్
  • Share this:
వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్..! దేశ ప్రజలందరికీ సుపరిచితమైన పేరు. పాకిస్తాన్ యుద్ద విమానాన్ని కూల్చేక్రమంలో పాక్ ఆర్మీకి చిక్కి భారత సైన్యం తెగువచూపిన.. అభినందన్ దేశ ప్రజలకు రియల్ హీరోగా మారాడు. ఆయన మీసకట్టుకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఎంతో మంది యువకులు అభినందన్‌ మీసాల స్టైల్‌ను ఫాలో అయ్యారు. ఐతే తాజాగా లోక్‌సభలో అభినందన్ మీసకట్టుపై ఆసక్తికర చర్చ జరిగింది. ఆయన మీసకట్టును జాతీయ మీసకట్టుగా ప్రకటించాలని కాంగ్రెస్ ఎంపీ ఆదిర్ రంజన్ చౌదరి అభిప్రాయపడ్డారు.

ఇండియా-పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో వీరత్వాన్ని ప్రదర్శించిన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్‌ అవార్డు ఇవ్వాలి. అంతేకాదు ఆయన మీసకట్టును జాతీయ మీసకట్టుగా ప్రకటించాలి.
ఆదిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ ఎంపీ
ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్ ఉగ్రవాద స్థావరంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడులుచేసి పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆ మరుసటి రోజే భారత మిలటరీ స్థావరాలను పాకిస్తాన్ వాయుసేన టార్గెట్ చేయడంతో.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అప్రమత్తమై తిప్పికొట్టింది. భారత్ వైపు దూసుకొచ్చిన పాకిస్తాన్ యుద్ధ విమానాల్లో F-16ని అభినందన్ తరిమికొట్టాడు. మిగ్-21 బైసన్ ఫైటర్ జెట్‌తో వెంబడించి ఎఫ్-16 విమానాన్ని కూల్చేశాడు. ఆ క్రమంలో పాక్ విమానంతో పాటు అభినందన్ విమానం కూడా కుప్పకూలింది.

పారాచూట్ సాయంతో ప్రాణాలు కాపాడుకున్న అభినందన్..పీవోకేలోని ఓ గ్రామంలో దిగడంతో స్థానికులు చితకబాది పాక్ మిలటరీకి అప్పగించారు. భారత వాయుసేన రహస్యాలను కూపీలాగేందుకు పాకిస్తాన్ ఆర్మీ ప్రయత్నించినప్పటికీ..అభినందన్ ఏ వివరాలను బహిర్గతం చేయలేదు. ఐతే భారత్‌తో పాటు అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిళ్లు రావడంతో ఎట్టకేలకు తలొగ్గిన పాకిస్తాన్...అభినందన్‌ను తిరిగి భారత్‌కు అప్పగించింది. కాగా, F-16 జెట్‌ని కూల్చిన తొలి ఫైటర్ పైలట్ అభినందనే కావడం విశేషం.

First published: June 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>