వాయుసేనలోకి వింగ్ కమాండర్ అభినందన్ పునరాగమనం...జమ్మూ ఎయిర్ బేస్‌లో పండగ వాతావరణం...

వింగ్ కమాండర్ అభినందన్ తిరిగి విధుల్లోకి వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఎయిర్ బేస్‌లోని సిబ్బంది, సహ జవాన్లు ఘనంగా స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించారు. అభినందన్ ధైర్యసాహసాలను గుర్త చేస్తూ నినాదాలు చేశారు.

news18-telugu
Updated: May 4, 2019, 10:40 PM IST
వాయుసేనలోకి వింగ్ కమాండర్ అభినందన్ పునరాగమనం...జమ్మూ ఎయిర్ బేస్‌లో పండగ వాతావరణం...
వింగ్ కమాండర్ అభినందన్ తిరిగి విధుల్లోకి వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఎయిర్ బేస్‌లోని సిబ్బంది, సహ జవాన్లు ఘనంగా స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించారు. అభినందన్ ధైర్యసాహసాలను గుర్త చేస్తూ నినాదాలు చేశారు.
  • Share this:
వింగ్ కమాండర్ అభినందన్ తిరిగి విధుల్లోకి చేరారు. విరామం అనంతరం అభినందన్ తిరిగి పైలట్ గా విధుల్లోకి చేరుతున్నట్లు జమ్మూ ఎయిర్ బేస్ లో రిపోర్టు చేశారు. ఇదిలా ఉంటే పాకిస్థాన్ ఎఫ్ 16 విమానాన్ని కూల్చి, పాకిస్థాన్ భూభాగంలో శత్రు సైన్యానికి చిక్కి, అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన వింగ్ కమాండర్ అభినందన్ పేరు దేశమంతటా మారుమోగింది. అయితే పాక్ చెర నుంచి విడుదలయ్యాక అభినందన్‌కు ప్రత్యేక వైద్య చికిత్సలు నిర్వహించారు. అనంతరం ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన ఫిట్ నెస్ పరీక్షల్లో నిరూపించుకున్న అభినందన్ తిరిగి విధుల్లో చేరమని ఉన్నతస్థాయి వర్గాలు ఆమోదం తెలిపాయి. దీంతో వాయుసేన పిలుపు అందుకున్న అభినందన్ తాను విధులు నిర్వర్తిస్తున్న జమ్మూ ఎయిర్ బేస్ లో తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యారు.

ఇదిలా ఉంటే వింగ్ కమాండర్ అభినందన్ తిరిగి విధుల్లోకి వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఎయిర్ బేస్‌లోని సిబ్బంది, సహ జవాన్లు ఘనంగా స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించారు. అభినందన్ ధైర్యసాహసాలను గుర్త చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు సన్నిహితులు భావోద్వేగానికి గురయ్యారు.

First published: May 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading