Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    ఒక్కసారి కాదు..వెయ్యి సార్లు పాకిస్తాన్‌కు వెళ్తా: సిద్దు

    ప్రధాని మోడీ 2015లో లాహోర్‌లో పర్యటించినప్పుడు అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను హగ్ చేసుకున్నట్లు సిద్దు గుర్తు చేశారు.అందులో తప్పులేనప్పుడు..ఇది తప్పు ఎలా అవుతుందని బీజేపీని ప్రశ్నించారు.

    news18-telugu
    Updated: August 22, 2018, 8:17 PM IST
    ఒక్కసారి కాదు..వెయ్యి సార్లు పాకిస్తాన్‌కు వెళ్తా: సిద్దు
    పంజాబ్ మంత్రి సిద్దు
    • Share this:
    పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్దు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జావెద్ భజ్వా హగ్‌పై దుమారం కొనసాగుతోంది. బోర్డర్‌లో సైనికుల చంపుతున్న పాక్ ఆర్మీ చీఫ్‌ని కౌగించుకొని అమరవీరులను సిద్దు అవమానపరిచారని బీజేపీ సహా పంజాబ్ విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో సిద్దు మరోసారి బీజేపీపై నిప్పులు చెరిగారు. ఒక్కసారి కాదు..ఇమ్రాన్ పిలిస్తే వెయ్యిసార్లైనా పాకిస్తాన్‌కు వెళ్తానని స్పష్టంచేశారు.



    ప్రతి ఒక్కరికి సహజంగానే అలాంటి భావోద్వేగాలు ఉంటాయి. నేను కూడా అలాగే పాక్ ఆర్మీచీఫ్‌ని హగ్ చేసుకున్నా. ఇది కూడా మోడి-షరీఫ్ కౌగిలింతలాంటిదే. దీన్ని ఎందుకు భిన్నంగా చూస్తున్నారో అర్థం కావడం లేదు. ఒక్కసారి కాదు..ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానిస్తే వెయ్యిసార్లు పాకిస్తాన్‌కు వెళ్తా.
    నవజోత్ సింగ్ సిద్దు, పంజాబ్ మంత్రి


    ప్రధాని మోడీ 2015లో లాహోర్‌లో పర్యటించినప్పుడు అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను హగ్ చేసుకున్నట్లు సిద్దు గుర్తు చేశారు.అందులో తప్పులేనప్పుడు..ఇది తప్పు ఎలా అవుతుందని బీజేపీని ప్రశ్నించారు. ఇరుదేశాల భక్తులు, యాత్రికుల కోసం డేరాబాబా నానాక్ (భారత్), కర్తార్‌పూర్ సాహిబ్ (పాకిస్తాన్) మధ్య కారిడార్ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పాక్ ఆర్మీ చీఫ్ చెప్పారని.. ఆ క్రమంలోనే భావోద్వేగంతో ఆయన్ను హత్తుకున్నానని వివరణ ఇచ్చారు.

    సిద్దు హగ్‌పై వారం రోజులుగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై మరొకరు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. పోటాపోటీగా ప్రెస్‌మీట్లు నిర్వహిస్తూ దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సైతం సిద్దును వెనకేసుకొస్తూ బీజేపీపై ఎదురుదాడికి దిగుతోంది.
    Published by: Shiva Kumar Addula
    First published: August 22, 2018, 8:13 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading