రైల్వేలో ఇకపై స్వదేశీ టెక్నాలజీ, స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం

ప్రభుత్వరంగ సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌లో ఆధునీకరణలో భాగంగా చైనా పరికరాలను ఉపయోగించకూదని టెలికాం మంత్రిత్వశాఖ ఇప్పటికే ఆదేశించింది. అటు ప్రజలు సైతం తాము చైనా ఉత్పత్తులను బహిష్కరిస్తున్నామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

news18-telugu
Updated: June 20, 2020, 7:29 AM IST
రైల్వేలో ఇకపై స్వదేశీ టెక్నాలజీ,  స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్ ప్రకటించిన తర్వాత.. వోకల్ ఫర్ లోకల్ నినాదం ఊపందుకుంది. దీనికి తోడు సరిహద్దులో డ్రాగన్ రెచ్చిపోతున్న నేపథ్యంలో చైనా వస్తువులను బహిష్కరించాలని డిమాండ్ వినిపిస్తోంది. చైనా కంపెనీలతో ఒప్పందాలు రద్దు చేసుకోవాలని భారత ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై రైల్వే అవసరాలకు దేశంలో తయారైన విడిభాగాలను వినియోగించడమే లక్ష్యంగా ముందుకు వెళతామని, దిగుమతులను పూర్తిగా తగ్గిస్తామని వెల్లడించారు. రైల్వేకు అవసరమైన పరికరాల కోసం దేశీయ సంస్థల నుంచి మాత్రమే టెండర్లను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

భారతీయ రైల్వే ఇప్పటికే ఓ చైనా కంపెనీతో కీలక ఒప్పందం రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. బీజింగ్ నేషనల్ రైల్వే రీసెర్చ్‌ అండ్ డిజైన్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ అండ్ కమ్యూనికేషన్ సంస్థకు 2016లో కేటాయించిన కాంట్రాక్టును రద్దు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒప్పందం రద్దుకు సంబంధించి భారతీయ రైల్వేకు చెందిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) సంస్థ ఒప్పటికే ఒక ప్రకటన చేసింది. యూపీలోని కాన్పూర్‌- దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ సెక్షన్‌ మధ్య 417 కి.మీ. మేర టెలీకమ్యూనికేషన్, సిగ్నలింగ్ ప్రాజెక్టుకు సంబంధించి DFCCIL చైనా సంస్థతో 2016లో ఒప్పందం చేసుకుంది. దీని విలువ రూ.471 కోట్ల రూపాయలు. ఒప్పందం ప్రకారం చైనా సంస్థ అవసరమైన సాంకేతిక పత్రాలను సమర్పించలేదని, అలానే ఇంజనీర్లు, ఇతర సిబ్బందిని తమకు కేటాయించలేదని సదరు సంస్ధ తెలిపింది. దీనిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని.. ఈ క్రమంలోనే ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు వెల్లడించింది.

కాగా. గల్వాన్‌ లోయ ఘర్షణ తర్వాత చైనాపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. చైనాపై ఆర్థికపరమైన చర్యలు చేపట్టాలని.. దాదాపు 100 రకాల చైనా ఉత్పత్తులపై నిషేధం విధించాలని యోచిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు 5జీతో పాటు ఎలాంటి ఇతర కాంట్రాక్టులను భారత కంపెనీలు సొంతం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ప్రభుత్వరంగ సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌లో ఆధునీకరణలో భాగంగా చైనా పరికరాలను ఉపయోగించకూదని టెలికాం మంత్రిత్వశాఖ ఇప్పటికే ఆదేశించింది. అటు ప్రజలు సైతం తాము చైనా ఉత్పత్తులను బహిష్కరిస్తున్నామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
First published: June 20, 2020, 7:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading