• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • WILL SLAP YOU TWO TIMES UNION MINISTER PRAHLAD PATEL ANGRY ON PERSON WHO ASK FOR MEDICAL OXYGEN AK

ఆక్సిజన్ అడిగిన వ్యక్తిపై కేంద్రమంత్రి ఆగ్రహం.. రెండు చెంప దెబ్బలు ఇస్తానంటూ..

ఆక్సిజన్ అడిగిన వ్యక్తిపై కేంద్రమంత్రి ఆగ్రహం.. రెండు చెంప దెబ్బలు ఇస్తానంటూ..

కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ (ఫైల్ ఫోటో)

బాధితుడి ఆవేదన చూసిన కేంద్రమంత్రి.. అధికారులతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

  • Share this:
    దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఓ వైపు కరోనా రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్ వేయించుకోవాలని కొందరు భావిస్తుంటే.. మరికొందరు ఆస్పత్రిలో కరోనాతో పోరాడుతున్నారు. వీరిలో కొందరు మెడికల్ ఆక్సిజన్ సపోర్ట్‌తో ఉంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో త‌మ వాళ్ల కోసం ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు ప‌ట్టుకొని క్యూలో నిల‌బ‌డాల్సిన ప‌రిస్థితి నెలకొంది. ప్రస్తుతం దేశంలోని అనేక ఆస్పత్రులు స‌రైన ఆక్సిజ‌న్ నిల్వలు లేక ఇబ్బందిపడుతున్నాయి. అయితే కరోనా బాధితురాలైన తమ బంధువుకు ఆక్సిజ‌న్ అందించాల‌ని కోరిన ఓ వ్యక్తిపై కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

    తాను ప్రాతినిథ్యం వ‌హిస్తున్న మధ్యప్రదేశ్‌లోని దామోహ్ నియోజ‌క‌వ‌ర్గంలో పర్యటించారు కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్. పూర్తిస్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్చిన దామోహ్ జిల్లా ఆస్పత్రిని సంద‌ర్శించారు. ఈ సందర్భంగా మంత్రిగారికి తమ గోడు వినిపించుకునేందుకు కొందరు అక్కడికి వచ్చారు. వారిలో ఓ వ్యక్తి తమ బంధువుకు ఆక్సిజన్ అందడం లేదని మంత్రితో అన్నారు. దీనికి సీరియ‌స్‌గా స్పందించిన మంత్రి ప్రహ్లాడ్ పటేల్.. ఇలాగే మాట్లాడితే నీకు రెండు చెంప దెబ్బులు ఇస్తానంటూ మండిపడ్డారు. అయితే బాధితుడి ఆవేదన చూసిన మంత్రి.. అధికారులతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు