కరోనా మహమ్మారి (Corona pandemic) చెలరేగినప్పటి నుంచీ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ తాకిడి భీభత్సంగా పెరిగింది. ఓ హిందీ న్యూస్ పేపర్ ప్రచురించిన వార్తల ప్రకారం కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో మోడీ సర్కారు కోత విధించనుందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అన్ని శాఖల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ కోతను ఎదుర్కోనున్నారన్నది ఈ వార్తల సారాంశం. గ్రేడింగ్ విధానంలో ఇలా కోతలు పెడతారని, ఇందుకు సరికొత్త కార్మిక చట్టాలే కారణమని సదరు పత్రిక ఘోషిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ కొలువుల్లో ఉన్నవారికి వణుకు మొదలైందన్నమాట. కానీ కేంద్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయాలు ఏవీ తీసుకోలేదు. ఈమేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) కూడా స్పష్టత ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న ఈ వార్త శుద్ధ అబద్ధం అని అధికారికంగా తేలింది. వేజెస్ బిల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించదని పీఐబీ వివరణ ఇచ్చింది.
అంతా ఫేక్..
“లేబర్ చట్టంలో సవరణల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లిస్తున్న జీతాల్లో కోత విధిస్తారని, కొత్త సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందన్న విషయంలో ఎటువంటి నిజం లేదు. ఇది ఫేక్ వార్త, 2019 సాలరీ బిల్లు కేంద్ర-రాష్ట్ర్ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించదు ”.. అంటూ పీఐబీ స్పష్టమైన వివరణ ఇచ్చింది.
ఆ ట్వీట్ మీరే చూడండి..
एक न्यूज़ आर्टिकल में दावा किया जा रहा है कि श्रम क़ानून में बदलाव होने के कारण अगले वर्ष से सरकारी कर्मचारियों का वेतन कम हो जाएगा। #PIBFactCheck: यह दावा फर्जी है। वेतन विधेयक, 2019 केंद्र और राज्य सरकारों के कर्मचारियों पर लागू नहीं होगा। pic.twitter.com/Et2tI62mMb
— PIB Fact Check (@PIBFactCheck) December 28, 2020
గతంలోనూ ఇలాంటి ఫేక్ న్యూస్
మరోవైపు ఈ ఫేక్ న్యూస్ విపరీతంగా ప్రాచుర్యంలోకి రావటంతో ఈ విషయంపై ఎటువంటి సందేహాలున్నా, ఎవరైనా తమ ప్రశ్నలను పీఐబీకి పంపించి, వివరణ పొందవచ్చని పీఐబీ పేర్కొంది. తప్పుడు వార్తలు నమ్మవద్దని, ఫేక్ న్యూస్ ను షేర్ చేయవద్దని ప్రభుత్వం పేర్కొంది. కాగా గతంలోనూ ఇలాంటి వార్తలు వైరల్ కాగా దీనిపై అప్పట్లో కేంద్ర ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. కరోనా కారణంగా ప్రభుత్వ ఖజానాకు గండిపడగా ఆ భారం తగ్గించుకునేందుకు కేవలం ఎంపీలు, మంత్రులు, ప్రధాని జీతాలు మాత్రమే తాత్కాలికంగా తగ్గించారు. అప్పట్లోనూ ఇలాగే రూమర్లు షికార్లు చేయగా, ఏ స్థాయిలో ఉన్న ఉద్యోగికి అయినా జీతంలో ఎలాంటి కోతలు ఉండవని, ప్రస్తుతం సాగుతున్నదంతా వట్టి పుకార్లేనంటూ ఆర్థిక శాఖ అధికారికంగా ట్వీట్ చేసింది. నిజానికి కరోనా లాక్ డౌన్ (lockdown) సమయంలో ఆర్థిక కార్యకలాపాలు స్థంభించగా ప్రభుత్వానికి కనీస ఆదాయం కూడా రాలేకపోయినప్పటికీ సర్కారీ కొలువుల్లోని వారి జీతాలపై ఎలాంటి కోతలు ఇప్పటి వరకు విధించలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central govt employees, Fact Check