గుజరాత్లో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ(BJP) ముఖ్యనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల రికార్డులను బద్దలు కొట్టి అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీకి గుజరాత్(Gujarat) ప్రజల ఆశీస్సులు ఉన్నాయని ఆయన చెప్పారు. న్యూస్ 18 ఇండియా నిర్వహించిన గుజరాత్ అధివేషన్’లో పాల్గొన్న అమిత్ షా.. గుజరాత్ అభివృద్ధికి బీజేపీ అన్ని విధాలుగా కృషి చేసిందని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తమ పార్టీ రాష్ట్ర ప్రజల అంచనాలను అందుకుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆయన తనశైలిలో విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు గుజరాత్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరంలో 250 రోజులు కర్ఫ్యూ ఉందని గుర్తు చేశారు.
కానీ ఈ రోజు 20 ఏళ్ల కుర్రాడిని కర్ఫ్యూ అంటే ఏమిటని అడిగితే.. అతడు చెప్పలేడని.. ఆ యువకుడు బీజేపీ పాలనలో అసలు కర్ఫ్యూను చూడలేదని బదులిచ్చారు. తాము కొన్ని సంవత్సరాలుగా బలమైన ప్రభుత్వంతో సురక్షితమైన, బాగా అభివృద్ధి చెందిన, విద్యావంతులైన గుజరాత్‌ను తయారు చేయాలనుకుంటున్నామని అన్నారు. ఈ క్రమంలో అనేక రంగాల్లో ప్రగతి సాధించామని అన్నారు.
అందుకే గుజరాత్ ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని అన్నారు. రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓట్ల శాతం పెరుగుతుందని అమిత్ షా అన్నారు. సీట్లు కూడా పెరుగుతాయని చెప్పారు. భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని.. ఇప్పటి వరకు మెరుగైన పనితీరు ఉంటుందని వ్యాఖ్యానించారు. కుంభకోణాలపై కాంగ్రెస్ పార్టీని అమిత్ షా టార్గెట్ చేశారు.
Pm Modi: జీ-20 సదస్సుకు ప్రధాని మోదీ ..అధికారిక ప్రకటన రిలీజ్..బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తోనూ భేటీ అయ్యే ఛాన్స్
దేశంలోనే అతి పెద్ద పార్టీ హయాంలో కుంభకోణాల లెక్కలు చెప్పడం కష్టమని అన్నారు. అయితే తమ పాలనలో మాత్రం కుంభకోణాలు దొరకడం కష్టమని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అటువంటి వ్యవస్థను రూపొందించారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో సుపరిపాలన కొనసాగుతోందని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.