మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అవుతారా? రాహుల్ గాంధీ సమాధానం ఇదే...

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందా? ఈ ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.

  • Share this:
    రాహుల్ గాంధీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందా? ఈ ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఓ చానల్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన రాహుల్ గాంధీ తన వైఖరిని స్పష్టం చేశారు. మరోసారి కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యే ఆలోచన లేదని స్పష్టం చేశారు. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం తర్వాత తన పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. తాను రాసిన లేఖకు కట్టుబడి ఉంటానని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో రాహుల్ గాంధీ పార్టీ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తున్నారు. అలాగే, రఘురాం రాజన్, అభిజిత్ బెనర్జీ లాంటి ప్రఖ్యాత ఆర్థిక వేత్తలతో ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు. ఈ సమయంలో మరోసారి రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ దిగిపోయిన తర్వాత సోనియాగాంధీ మరోసారి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: