హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Delhi Model Virtual School: మీరు ఎక్కడున్నా ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో చదవచ్చు... దేశంలోనే మొట్ట మొదటి వర్చువల్ స్కూల్

Delhi Model Virtual School: మీరు ఎక్కడున్నా ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో చదవచ్చు... దేశంలోనే మొట్ట మొదటి వర్చువల్ స్కూల్

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (ఫైల్ ఫోటో)

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (ఫైల్ ఫోటో)

Delhi Virtual School: నిన్నటి నుంచి 9-12వ తరగతి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. కేవలం ఢిల్లీ విద్యార్థులు మాత్రమే కాదు.. దేశంలో ఎక్కడి వారైనా ఈ స్కూల్‌లో అడ్మిషన్ తీసుకోవచ్చు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ప్రభుత్వ స్కూళ్లంటే ప్రజల్లో ఓ చిన్న చూపు ఉంటుంది. అక్కడ తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందదని తల్లిదండ్రులు భావిస్తుంటారు. అందుకే వేలు.. లక్షలు ఖర్చు చేసి ప్రైవేట్ స్కూల్స్‌లో జాయిన్ చేస్తుంటారు.కానీ ఢిల్లీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రభుత్వ స్కూళ్లలో  (Delhi Model Schools) జాయిన్ చేసేందుకే పేరెంట్స్ మొగ్గుచూపుతున్నారు. అక్కడి స్కూళ్లకు అంతలా ఆదరణ లభిస్తోంది. కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ స్కూళ్లు ఉంటాయి. అంతలా మౌలిక సదుపాయలను కల్పిస్తున్నారు. విద్యా బోధన కూడా టాప్ క్లాస్‌లో ఉంది. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్పిస్తున్నారు. సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal), మంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia).. ఢిల్లీలో విద్యావ్యవస్థను బలోపేతం చేశారు. ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్య అందడమే లక్ష్యంగా సమూల మార్పులు చేశారు. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే తొలి వర్చువల్ స్కూల్‌ను సీఎం అర్వింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రారంభించారు. భౌతికంగా పాఠశాలకు వెళ్లలేని వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.AAP v/s Delhi LG : ఆప్ కు ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ బిగ్ షాక్  ఈ వర్చువల్ స్కూల్ ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు అనుబంధంగా నడుస్తుంది. నిన్నటి నుంచి 9-12వ తరగతి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. కేవలం ఢిల్లీ విద్యార్థులు మాత్రమే కాదు.. దేశంలో ఎక్కడి వారైనా ఈ స్కూల్‌లో అడ్మిషన్ తీసుకోవచ్చు. పలు కారణాలతో పాఠశాలలకు వెళ్లలేని ఈ వర్చువల్ స్కూల్‌లో చేరి.. తాము ఉన్న ప్రాంతాల్లోనే తరగతులకు హాజరుకావచ్చు. ఇక్కడ జేఈఈ (JEE), నీట్ (NEET), సీయూఈటీ (CUET) పరీక్షలకు కూడా నిపుణులతో కోచింగ్ ఇప్పిస్తారు. దేశవిద్యారంగంలోనే ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్.. ఒక మైలురాయి అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కరోనా సమయంలో నిర్వహించిన వర్చువల్ తరగతుల స్ఫూర్తితోనే ఈ పాఠశాల ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.


  ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్లో విద్యార్థులు లైవ్ క్లాస్‌లకు హాజరుకావచ్చు. పలు కారణాలతో లైవ్‌ క్లాస్‌లకు అటెండ్ కాలేకపోయినా ఇబ్బందేం ఉండదు. క్లాస్ సెషన్లను రికార్డ్ చేసి.. ఆ వివరాలను విద్యార్థులకు పంపిస్తారు. అప్పుడు విద్యార్థులు తమకు వీలైన సమయంలోనే పాఠాలు వినవచ్చు. ఈ సదుపాయాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచేందుకు ఒక్కో విద్యార్థికి ఒక్కో ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. అంతేకాదు డిజిటల్ లైబ్రరీ సేవలు కూడా అందుబాటులో ఉంచారు. పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకునే విద్యార్థులకు... స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్‌కు కూడా అందిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Arvind Kejriwal, Delhi, EDUCATION

  ఉత్తమ కథలు