హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అన్ని ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో(Himachal Pradesh) 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం కావాల్సిన కనీస మెజారిటీ 35 సీట్లు. ఇండియా టీవీ తన సర్వేలో హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీకి(BJP) 35-40 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు(Congress) 26 నుంచి 31 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఆప్‌కు ఒక్క సీటు కూడా రాకపోవచ్చని పేర్కొంది. ఇతరులకు 3 సీట్లు వస్తాయని అంచనా వేసింది. రాష్ట్రంలో బీజేపీకి 32 నుంచి 40 సీట్లు, కాంగ్రెస్‌కు 27 నుంచి 34 సీట్లు వస్తాయని న్యూడ్ ఎక్స్ అంచనా వేసింది. ఆప్‌కి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని అభిప్రాయపడింది.
రిపబ్లిక్ టీవీ మాత్రం హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీకి మెజారిటీ వస్తుందని అంచనా వేసింది. బీజేపీకి 34-39 సీట్లు, కాంగ్రెస్‌కు 28-33 సీట్లు రావొచ్చని వెల్లడించింది. క టైమ్స్ నౌ బీజేపీకి 34 నుంచి 42 సీట్లు వస్తాయని, కాంగ్రెస్‌కు 24-32 సీట్లు వస్తాయని అంచనా వేసింది.జీ న్యూస్ బార్క్తో కలిసి సర్వే నిర్వహించింది. ఈ రాష్ట్రంలో బీజేపీకి 35 నుంచి 40 సీట్లు, కాంగ్రెస్‌కు 20 నుంచి 25 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అయితే ఇండియా టుడే మాత్రం.. తన ఎగ్జిట్ పోల్‌లో బీజేపీకి 24 నుంచి 34 సీట్లు వస్తాయని, కాంగ్రెస్‌కు 30 నుంచి 40 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 75.6 శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలో ఒకే విడత పోలింగ్ జరిగింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో చివరిగా 75.57 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం మహిళా ఓటర్లలో 76.8 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, పురుషుల్లో ఇది 72.4 శాతంగా ఉంది. థర్డ్ జెండర్ పోల్ శాతం 68.4 శాతం. ఓటర్లలో మొత్తం పురుషులు 27.88 లక్షలు, స్త్రీలు 27.36 లక్షలు. థర్డ్ జెండర్ ఓటర్లు 38 మంది ఉన్నారు.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
ప్రధాని మోదీ సోదరుడు ఎమోషనల్..నరేంద్ర దేశం కోసం చాలా పని చేస్తున్నారంటూ వ్యాఖ్య..వీడియో
2017 ఎగ్జిట్ పోల్స్‌లో హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో బిజెపికి సులువుగా గెలుపొందుతుందని ఎక్కువశాతం ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 2017లో కాంగ్రెస్‌ను ఓడించి బీజేపీ 44 సీట్లు గెలుచుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.