హోమ్ /వార్తలు /జాతీయం /

ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యం... స్థానికులకే ప్రాధాన్యం... ఆమ్ ఆద్మీ పార్టీ మ్యానిఫెస్టో విడుదల...

ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యం... స్థానికులకే ప్రాధాన్యం... ఆమ్ ఆద్మీ పార్టీ మ్యానిఫెస్టో విడుదల...

ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టో రిలీజ్

ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టో రిలీజ్

AAP Manifesto : ఢిల్లీని స్వతంత్ర రాష్ట్రంగా ప్రకటించాలన్న ఏకైక లక్ష్యంతో మేనిఫెస్టోని రిలీజ్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ.

Lok Sabha Election 2019 : లోక్ సభ ఎన్నికలకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలను రిలీజ్ చేశాయి. ఆ రెండు పార్టీలకూ గట్టి పోటీ ఇస్తామంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా తన మేనిఫెస్టోను విడుదల చేసింది. భారతీయ ప్రజాస్వామ్యాన్నీ, రాజ్యాంగాన్నీ రక్షించడమే ఎన్నికల మ్యానిఫెస్టో అని ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించేవరకూ పోరాటం సాగిస్తామన్నారు. ఇది తమ పార్టీ మేనిఫెస్టో మాత్రమే కాదన్న ఆయన... దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దాన్ని రూపొందించామన్నారు. భారత్ ఐక్యత ప్రమాదంలో ఉందనీ, విచ్ఛిన్నకర శక్తుల నుంచీ దేశాన్ని రక్షించుకునేలా తమ మ్యానిఫెస్టోను తయారు చేశామని కేజ్రీవాల్ ప్రకటించారు.కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఈసారి ఢిల్లీలోని ఏడు లోక్ సభ సీట్లు అత్యంత కీలకం అవుతాయనని కేజ్రీవాల్ అన్నారు. మహిళల భద్రత, ఆరోగ్యం, కాలుష్యం, అవినీతి లాంటి అంశాలు ఢిల్లీని శాపాలయ్యాయని, రాష్ట్రం చేతుల్ని కేంద్రం కట్టడి చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కేజ్రీవాల్ మండిపడ్డారు. తమ ప్రధాన అజెండా... ఈసారి కేంద్రంలో బీజేపీ-NDA ప్రభుత్వం అధికారంలోకి రాకుండా చెయ్యడమే అన్నారు. అందుకోసం ఎలాంటి లౌకిక మహాఘట్‌బంధన్‌ (లౌకిక మహా కూటమి)కైనా మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.


ఆప్ మేనిఫెస్టోలో ఉద్యోగాలు, ఉన్నత విద్య, మహిళల రక్షణ వంటి అంశాల్ని హైలెట్ చేశారు. ఢిల్లీని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తే, ఢిల్లీ పోలీస్ వ్యవస్థలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో మూడింట రెండొంతుల ఖాళీలను తాము భర్తీ చేస్తామన్నారు కేజ్రీవాల్. ఢిల్లీ పోలీసులు రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా ఉండేలా చేస్తామన్నారు.


ఇతర నగరాల్లో విద్యార్థులు, ఢిల్లీలోని యూనివర్శిటీల్లో సీట్లు సంపాదించేసుకుంటున్నారన్న కేజ్రీవాల్... ఢిల్లీలో విద్యార్థులు మాత్రం 95 శాతం మార్కులు తెచ్చుకున్నా, సీట్లు సంపాదించుకోలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే, ఢిల్లీలోని యూనివర్శిటీల్లో 85 శాతం సీట్లను ఢిల్లీలో స్టూడెంట్లకే రిజర్వేషన్ చేయిస్తానన్నారు.


ఢిల్లీలో ఎన్నికలు మే 12న జరగనున్నాయి. ఫలితాలు మే 23న రానున్నాయి.


 


ఇవి కూడా చదవండి :


ఏపీలో IASల సమావేశానికి 95 శాతం మంది గైర్హాజరు... చంద్రబాబు హ్యాపీ...


ఏపీలో రాష్ట్రపతి పాలన రాబోతోందా... కేంద్రం నుంచీ సంకేతాలు...


పైకి హ్యాపీ... లోపల టెన్షన్... చంద్రబాబు, జగన్ ఇద్దరూ అంతే... గెలుపుపై రకరకాల లెక్కలు...


చంద్రబాబుకి సింగపూర్... జగన్‌కు స్విట్జర్లాండ్... వైసీపీ అధినేత ప్లాన్ అదిరిందిగా...

First published:

Tags: AAP, Aravind Kejriwal, Arvind Kejriwal, Delhi, Delhi Lok Sabha Elections 2019, Delhi news

ఉత్తమ కథలు