హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

అధికారంలోకి వస్తే జయలలిత మృతిపై ప్రత్యేక దర్యాప్తు చేయిస్తాం...స్టాలిన్ సంచలన ప్రకటన

అధికారంలోకి వస్తే జయలలిత మృతిపై ప్రత్యేక దర్యాప్తు చేయిస్తాం...స్టాలిన్ సంచలన ప్రకటన

డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్

డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్

జయలలిత మృతిపై పలు కుట్రలు జరిగాయని ఆమె అభిమానులు నమ్ముతున్న నేపథ్యంలో స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. ముఖ్యంగా జయలలిత మృతి వెనుక ఉన్న కుట్రలను ఛేదించి ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు.

  తాము అధికారంలోకి వస్తే మాజీ సీఎం జయలలిత మృతి మిస్టరీని ఛేదిస్తామని డీఎంకే నేత స్టాలిన్ ప్రకటించారు. ఇప్పటికే జయలలిత మృతిపై పలు కుట్రలు జరిగాయని ఆమె అభిమానులు నమ్ముతున్న నేపథ్యంలో స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. ముఖ్యంగా జయలలిత మృతి వెనుక ఉన్న కుట్రలను ఛేదించి ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. ఇప్పటికే రిటైర్డ్ జడ్జి ఆరుముగసామి కమిటీ జయమృతిపై విచారణ జరుపుతోంది. అయితే కమిటీ చేసిన ఆరోపణలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని అన్నారు. కమిటీ సక్రమంగా పని చేయకుండా ముఖ్యమంత్రి పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అడ్డుకుంటున్నారని స్టాలిన్ అనుమానం వ్యక్తం చేశారు. జయ మృతి వెనుక కుట్రను వెలికి తీయడానికి అన్నాడీఎంకే ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని ఆయన ఆరోపించారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన వెంటనే సమగ్ర విచారణ జరిపి, జయ మృతి వెనుక ఉన్న కుట్రను బహిర్గతం చేస్తామని అన్నారు.

  జయ మృతి వెనుక దాగి ఉన్న నిజాలను వెలికితీస్తానని ప్రకటించిన పన్నీర్ సెల్వం ఇప్పుడు ఎందుకు మౌనంగా మారిపోయారని స్టాలిన్ ప్రశ్నించారు. అయితే జయ మృతి కేసులో ప్రధాన నిందితుడు పన్నీర్ సెల్వం అని ఆరోగ్యమంత్రి విజయభాస్కర్ ఆరోపించారన్న విషయాన్ని స్టాలిన్ గుర్తు చేశారు. విచారణకు హాజరు కావాలని 2018 డిసెంబర్ లో పన్నీర్ సెల్వంకు కమిటీ సమన్లు పంపినా ఆయన పట్టించుకోలేదని పేర్కొన్నారు.

  మొదట్లో జయలలిత మృతికి శశికళే కారణమని అన్నాడీఎంకే పార్టీ వర్గాలే అనుమానించాయని స్టాలిన్ గుర్తు చేశారు. అంేతకాదు జయ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగానే అక్రమ పద్ధతిలో అన్నాడీఎంకే శాసనసభ్యుల సమావేశం ఆ పార్టీ కార్యాలయంలో జరిగిందని, పన్నీర్‌సెల్వంను సభాపక్ష నాయకుడిగా ఎంపిక జరిగిందన్నారు. అదే సమయంలో జయ మృతి చెందినట్టు అధికార పార్టీకి చెందిన మీడియా చానెల్ లోనే వార్త వెలువడిందని, అదే సమయంలో అన్నాడీఎంకే కార్యాలయం వద్ద పార్టీ పతాకాన్ని దించేశారని చేశారని గుర్తు చేశారు.

  కాసేపటికి ఆమె ఇంకా బతికి ఉందని పార్టీ జెండాను మళ్లీ పైకి ఎగురవేశారని, ఇలా ప్రతీ ఒక్క సంఘటన అనుమానాస్పదంగా వుందన్నారు. వీటన్నిటికీ తోడు జయ మృతికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడకముందే అర్ధరాత్రివేళ పన్నీర్‌సెల్వం, ఆయన మంత్రి వర్గం రాజ్‌భవనలో ప్రమాణస్వీకారం జరిగిందని, ఇవన్నీ పూర్తయిన తర్వాత జయలలిత రాత్రి 11.30 గంటలకు మృతి చెందినట్టు అధికారిక ప్రకటన వెలువడైందన్నారు. ఆ సంఘటనలన్నింటినీ పరిశీలిస్తే జయలలిత దరిదాపులకు ఎవరినీ రానీయకుండా అక్రమాలకు పాల్పడినట్టు రుజువవుతోందని పేర్కొన్నారు.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Jayalalithaa, MK Stalin, Tamil nadu

  ఉత్తమ కథలు