హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

అందుకు ఒప్పుకుంటేనే మళ్లీ చర్చలు.. రైతు సంఘాలకు తేల్చి చెప్పిన కేంద్రం

అందుకు ఒప్పుకుంటేనే మళ్లీ చర్చలు.. రైతు సంఘాలకు తేల్చి చెప్పిన కేంద్రం

కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్( Image:PTI)

కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్( Image:PTI)

New Farm Laws: కొత్త వ్యవసాయ చట్టాల అమలు ఏడాదిన్నర పాటు వాయిదా వేస్తామని రైతులకు సూచించిన కేంద్రం.. ఇందుకు అంగీకరిస్తేనే రైతు సంఘాలతో కేంద్రం మళ్లీ చర్చలు జరుపుతుందని స్పష్టం చేసింది.

కొత్త వ్యవసాయ చట్టాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలతో చర్చలు జరుపుతున్న కేంద్రం.. నేడు 11వ విడత చర్చలు జరిపింది. అయితే మొన్న జరిగిన చర్చల సందర్భంగా కాస్త మెత్తబడినట్టు కనిపించిన కేంద్రం.. ఈసారి మాత్రం కచ్చితంగానే వ్యవహరించింది. కొత్త వ్యవసాయ చట్టాల అమలు ఏడాదిన్నర పాటు వాయిదా వేస్తామని రైతులకు సూచించిన కేంద్రం.. ఇందుకు అంగీకరిస్తేనే రైతు సంఘాలతో కేంద్రం మళ్లీ చర్చలు జరుపుతుందని స్పష్టం చేసింది. చట్టాలను 18 నెలల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చర్చల అనంతరం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు.

దీనికి మించి ఇక ఏమీ చేయలేమని అన్నారు. అంతకుమించి మాట్లాడలేమని స్పష్టం చేశారు. దీనికి రైతులు ఓకే చెబితే మళ్లీ చర్చలు జరుపుకోవచ్చని అన్నారు. మరోవైపు ఎన్నిసార్లు చర్చలు జరిపినా.. రైతు సంఘాలు పట్టువీడకపోవడంపై కేంద్రం కూడా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇకపై వారితో కఠినంగానే వ్యవహరించాలని భావిస్తోంది. తాము రైతుల సమస్యలను పరిష్కరించాలని భావించామని.. అందుకోసం తాము తీసుకొచ్చిన ప్రతిపాదనలు కూడా సంతృప్తికరంగా ఉన్నాయని కేంద్రమంత్రి రైతు సంఘాలతో వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.


మరోవైపు కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా తాము తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ యథావిథిగా ఉంటుందని రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ తెలిపారు. రెండేళ్ల పాటు చట్టాలను తాత్కాలికంగా నిలిపేస్తామని కేంద్రం ప్రతిపాదించిందని, ఈ ప్రతిపాదనకు సిద్ధంగా ఉంటేనే తదుపరి రౌండ్ సమావేశాలు జరుగుతాయని ప్రభుత్వం పేర్కొందని టికాయత్ వెల్లడించారు.

First published:

Tags: Farmers Protest

ఉత్తమ కథలు